వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ రాక: వెబ్‌సైట్ ప్రారంభించిన యుఎస్ ఎన్నారైలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనుండటంతో ది ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్(ఐఏసిఎఫ్) ఆధ్వర్యంలో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు ప్రవాసులు తెలిపారు.

పిఎంవిజిట్.ఓఆర్‌జి(pmvisit.org) పేరిట ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 28న అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. సుమారు 20వేల మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని వార్తల విశ్లేషణ వెబ్‌సైట్ నితి సెంట్రల్ పేర్కొంది.

Indian-American foundation launches website for Modi's US reception

సుమారు 300కు పైగా ఇండియన్ అమెరికన్ సంస్థలు ఒక్కటై అభినందనలు తెలియజేయనున్నట్లు ఐఏసిఎఫ్ తెలిపింది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ మెడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అభినందన సభ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఆసక్తి కలిగిన ఇతర కమ్యూనిటీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావొచ్చని ఐఏసిఎఫ్ తెలిపింది. కార్యక్రమంలో వాలంటీర్లుగా పని చేసే వారు తమను సంప్రదించవచ్చని పేర్కొంది.

English summary
The Indian American Community Foundation (IACF) has launched a website to give a community reception for Prime Minister Narendra Modi in the US in September, a media report said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X