బాలుడి మృతి: తల్లిపై హత్యాభియోగం

వివరాల్లోకి వెళితే.. పల్లవి ధావన్ (38) అనే భారతీయ మహిళ తన పదేళ్ల కుమారుడు అరుణవ్‌ను హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన మూడు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితురాలి తరపు న్యాయవాది డేవిడ్ ఫిన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. జనవరి 29న పల్లవి తన కుమారుడ్ని పాఠశాలకు పంపేందుకు ఉదయం నిద్రలేపింది. అయితే జలుబుతో బాధపడుతూ.. స్పందన లేకపోవడంతో పల్లవి మళ్లీ నిద్రలేపేందుకు ప్రయత్నించింది.
పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతోనే ఈ విధంగా ప్రవర్తించాడని అనుకున్న పల్లవి, అతన్ని స్నానం చేయించేందుకు స్నానపు గదిలోకి తీసుకెళ్లి టబ్‌లో వేసింది. అయితే మళ్లీ వచ్చి చూసేసరికి అరుణవ్ మృతి చెంది ఉన్నాడని పల్లవి తన అఫిడవిట్‌లో పేర్కొంది. దీంతో పల్లవి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సిపిఆర్ ద్వారా కదలికను పెంచేందుకు విఫలయత్నం చేశారు. తన భర్త సుమిత్ ధావన్ ఊరిలో లేకపోవడంతో అతను వచ్చే వరకు తన కుమారుడ్ని చూసుకోవాలని తలిచి అతనికి స్నానం చేయించి, ఇష్టమైన దుస్తులు వేసి సంప్రదాయం ప్రకారం తయారు చేసినట్లు పల్లవి తెలిపింది.
తన కుమారుడ్ని ఏ విధంగానూ వేధించలేదని పల్లవి తెలిపింది. అరుణవ్‌ను తాను చంపలేదని పల్లవి పేర్కొంది. తాను అత్యంత ప్రేమగా చూసుకునే తన కుమారుడ్ని తాను హత్య చేయలేదని కన్నీటి పర్యాంతమవుతూ తెలిపింది. కాగా, మార్చిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అతని మృతికి సరైన కారణాన్ని గుర్తించలేకపోయారు. సహజమైన కారణాలతోనే అతడు మృతి చెందాడని సిబిఎస్ న్యూస్ కథనాలను ప్రచురించింది.












Click it and Unblock the Notifications