ఎన్నారై యువతికి బాలల శాంతి బహుమతి(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికాలో నివాసముంటున్న ప్రవాస భారతీయురాలు నేహా గుప్తా(18)కి ఈ ఏడాదికి గాను అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపికయ్యారు. భారతదేశంతోపాటు అమెరికాలోని అనాథ పిల్లల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నేహా గుప్తాకి ఈ వార్డు దక్కింది.

మంగళవారం ది హేగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నెదర్లాండ్ష్ రాజు విలెం అలెగ్జాండర్, నోబెల్ శాంతి బహుమతి విజేత, మాజీ అర్చిబిషప్ డెస్మండ్ టాటూ ఈ అవార్డును నేహాకు అందజేశారు.
నేహా గుప్తా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొగ్రాం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే భారతదేశంలోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన నేహా, ఆ తర్వాత అనాథ పిల్లల కోసం ‘ఎంపవర్ ఆర్ఫాన్స్' పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.

ఇప్పటి వరకు 25వేల మందికిపైగా అనాథ చిన్నారులకు ఈ సంస్థ చేయూతనందించింది. ఈ సంస్థ చిన్నారులకు విద్యనందించడం, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం లాంటి వసతులను కల్పిస్తోంది. కాగా, నిరుడు ఈ అవార్డును పాకిస్థాన్ బాలికల విద్యా హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్ అందుకున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications