వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైకి 18 నెలలు జైలు శిక్ష, సమాచారం చోరీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Indian engineer in US gets 18 months' jail for stealing secrets
న్యూఢిల్లీ: వాణిజ్య రహస్యాలను బయట పెట్టినందుకు అమెరికాలో నివసిస్తున్న 38 ఏళ్ల భారతీయ ఇంజనీరుకు 18నెలలు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే న్యూజెర్సీలోని బెక్టాన్ డికిన్సన్, మరో గ్లోబల్ మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వాణిజ్యపరమైన రహస్యాలను తన స్వలాభం కోసం బయట పెట్టాడని కేతన్ కుమార్ మనియార్ అనే వ్యక్తికి అక్కడి కోర్టు 18 నెలల జైలు శిక్ష, 32 వేల డాలర్ల జరిమానా విధించింది.

2013లో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న మనియార్‌పై గురువారం నాడు ట్రెంన్టన్‌‌లోని ఫెడరల్ కోర్టు ఈ తీర్పుని విధించింది. సాల్ట్ లేక్‌లో ఉన్న సీఆర్ బార్డ్ అనే కంపెనీలో ఇంజనీర్‌గా 2004 నుంచి 2011 వరకు వివిధ రకాలైన మెడికల్ ఉత్పత్తులపై పని చేశాడు.

ఆ తర్వాత ఫిబ్రవరి 2012 నుంచి మే 2013 వరకు ప్రాంక్లిన్ లేక్‌లో ఉన్న బీడీ మెడికల్ సంస్దలో సిరంజీలు, పెన్ ఇంజక్షన్స్ ఉత్పత్తులపై పని చేశాడు. ఈ సంస్దలో పని చేసిని సమయంలో మనియార్ $115,000గా వేతనాన్ని పొందాడని కోర్టు డాక్యుమెంట్స్‌లో పేర్కొంది.

ఈ రెండు మెడికల్ సంస్దల్లో పని చేసిన సమయంలో ఆయా కంపెనీలకు సంబంధించిన మెడికల్ ఉత్పత్తులకు సంబంధించి రహస్యాలను తన స్వలాభం దొంగిలించాడని ఆయా సంస్దలు పేర్కొన్నాయి.

ఫిబ్రవరి 2012 నుంచి మే 2013 వరకు ప్రాంక్లిన్ లేక్‌లో ఉన్న బీడీ మెడికల్ సంస్దకు సంబంధించి సుమారు 8,000వేల ఫైళ్ల సమాచారాన్ని తన సొంత ఈమెయిల్స్‌కు పంపుకున్నాడని కంపెనీ ఫెడరల్ కోర్టులో ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ అతన్ని 2013లో అరెస్టు చేసింది.

English summary
An Indian engineer has been sentenced to 18 months in prison followed by deportation for stealing trade secrets from medical technology giant Becton Dickinson and another New Jersey company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X