NRI News: కోస్టారికాకు భారత అక్రమ వలసదారులు..!

అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను ఆదేశం వారిని వెనక్కు పంపిస్తోంది. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న భారతీయులను కూడా అక్కడి ప్రభుత్వం తిరిగి ఇండియాకు పంపుతున్నారు. భారత్ కు చెందిన అక్రమ వలసదారులు ఇప్పటికే మూడు విమానాల్లో భారత్ కు చేరుకున్నారు. మొదటి విమానంలో 104 మంది అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానాల్లో ఇండియాకు తరలించారు. విమానం అమృత్ సార్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

ఫిబ్రవరి 5న రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్నారు. మూడో దఫాలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకున్నారు. దీంతో 332 మంది అక్రమ వలసదారులు భారత్ కు వచ్చారు. అయితే వారిని తీసుకొచ్చే విధినంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చేతులు, కాళ్లకు బేడీలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. కరుడుగట్టిన నేరస్తుల లాగా వారిని తీసుకురావడంపై చర్చ జరుగుతోంది

Indian illegal immigrants living in the US to be deported to Costarica

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినా.. ఏ మాత్రం లాభం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తాజాగా అమెరికాలోని ఇండియా అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు కోస్టారికా సోమవారం తెలిపింది. 200 మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం రేపు కోస్టారికాకు చేరుకోనుంది. ఈ విమానంలో మధ్య ఆసియా, భారత్‌కు చెందినవారు ఉన్నారని కోస్టారికా ప్రభుత్వం వెల్లడించింది. వీరంతా అక్కడ ఏం చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

పనామా సమీపంలో ఏర్పాటు చేసిన వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరందరిని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ అక్రమ వలసదారులను పనామాకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+