ఎన్నారై దంపతులు, ఆయా అరెస్ట్

హత్యా నేరం కింద ఆయాగా పని చేస్తున్న కింజల్ పటేల్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను ఆ చిన్నారి అథియాన్ శివకుమార్ చాలా విసిస్తున్నాడనీ, దీంతో ఆగ్రహానికి గురైన తాను పాపను కిందకి విసిరేశానని చెప్పింది. ఈ ఘటన జనవరి 16న న్యూహవెన్‌లో చోటు చేసుకుంది.
కింజల్ పటేల్ కింద విసిరేయడం వల్ల అథియాన్ శివకుమార్‌కు గాయాలయ్యాయని థెన్మోజి రాజేంద్రన్.. మణి శివకుమార్‌కు చెప్పడంతో హుటాహుటిన అక్కడి చేరుకున్నాడు. వెంటనే అథియాన్‌ను ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలైన కారణంగా అథియాన్ శివకుమార్ ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా మృతి చెందిన అథియాన్ శివకుమార్ తల్లిదండ్రులు థెన్మోజి రాజేంద్రన్ (24), మణి శివకుమార్ (33)లను కూడా హత్యకు కారణమయ్యారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications