వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై రేప్: ఎన్నారైకి 18ఏళ్ల జైలు

|
Google Oneindia TeluguNews

 jail
మెల్బోర్న్: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన వ్యక్తికి ఆ దేశ కోర్టు 18 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ చక్రాల కూర్చిలో జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళలపై నిందితుడు వినోద్ జానీ కుమార్ సిగ్గుమాలిన పనికి పాల్పడ్డాడని విక్టోరియా కౌంటీ జడ్జి న్యాయమూర్తి ఫెలిసిటీ హంపెల్ గురువారం ఇచ్చిన తీర్పు సందర్భంగా అన్నారు. నిందితుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని న్యాయమూర్తి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహించబడుతున్న విక్టోరియాలోనే పెద్దదైన వికలాంగుల సేవా సంస్థ ‘యూరళ్ల'లో వినోద్ గతంలో సాధారణ కార్మికుడిగా విధులు నిర్వహించాడు. అతను సంస్థలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్టోబర్ 2011, జనవరి 2012 మధ్య వికలాంగులైన ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా మరో ఇద్దరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు అభియోగాలు నమోదయ్యాయి.

అవకాశం కోసం ఎదురుచూసిన నిందితుడు బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నేరం జరిగిన సమయంలో సేవా సంస్థలో అతనొక్కడే డ్యూటీలో ఉన్నాడని, దుర్భలురైన ముగ్గురు బాధితులపై, వయస్సును కూడా చూడకుండా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని న్యాయమూర్తి ఉటంకించారు.

2007లో ఆస్ట్రేలియాకు వచ్చిన వినోద్.. 2009లో యూరళ్ళలో కార్మికుడిగా చేరాడు. వైకల్యంతో బాధపడుతున్న వారి పట్ల అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో యాజమాన్యం 2011లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. యూరళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజిబ్ రాయ్ మాట్లాడుతూ.. వినోద్ వ్యవహారంతో చాలా నిరాశ నిస్పృహలకు గురయ్యామని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

English summary
A 31-year-old Indian-origin man has been sentenced by a Australian court to 18 years of imprisonment for sexually abusing three wheel-chair borne women in his care.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X