మాజీ భార్యను చంపి శవాన్ని సూట్‌కేసులో కుక్కాడు: జైలు పాలు
లండన్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను చంపేసి, శవాన్ని సూట్‌కేసులో కుక్కాడు. అతనికి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ఇంగ్లాండులో జరిగింది.
హత్య అభియోగాన్ని అశ్విన్ దౌడియా అంగీకరించలేదు. లీసెస్టర్‌లోని ఇంట్లో కిరణ్ దౌడియాతో వాగ్వివాదంతో జరిగిందని, కావాలని తాను దాడి చేయలేదని చెప్పాడు. అయితే, అతని వాదనను జ్యారీ అంగీకరించలేదు.

అతని వాదనతో ఏకీభవించని జ్యూరీ 46 ఏళ్ల కాల్ సెంటర్ వర్కర్ హత్య కేసులో అతన్ని దోషిగా నిర్ధారించింది. తన మాజీ భార్య శవాన్ని అతను సూట్‌కేసులో కుక్కుతున్న దృశ్యం సిసిటీవీ కెమెరాలో రికార్డయింది.
తనకు కోపం వచ్చిందని, దాంతో నియంత్రణ తప్పానని 51 ఏళ్ల అశ్విన్ లీసెస్టర్ క్రౌన్ కోర్టుకు చెప్పడు. తన నోరు మూయించడానికి కిరణ్ తన మీద తొలుత దాడి చేసిందని చెప్పాడు.












Click it and Unblock the Notifications