వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ అలలు: భారత సంతతి ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త బాలి బీచ్‌లో మృతి

|
Google Oneindia TeluguNews

జకార్తా: ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, ప్రపంచ బ్యాంక్‌ అనుంబంధంగా పనిచేస్తున్న ఆకాన్షా పాండే ఇండోనేషియాలోని బాలి బీచ్‌లో మృతిచెందారు. శనివారం సాయంత్రం బీచ్‌లోని నిషేధిత ప్రాంతంలో ఆమె స్విమ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన అలలు ఒక్కసారిగా ఆమెను తాకడంతో ఆకాన్షా ప్రవాహంలో కొట్టుకుపోయారు.

బీచ్‌ లైఫ్‌గార్డ్‌ ఆమెని కాపాడేందుకు ప్రయత్నించారు. అలల్లో కొట్టుకుపోతున్న ఆమెను బయటకు తీసుకువచ్చిన సిబ్బంది.. వెంటనే ఆమెను సిలోమ్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆకాన్షా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Indian-Origin World Bank Economist Drowns at Bali Beach

భారత్‌ సంతతికి చెందిన ఆకాన్షా ప్రస్తుతం యూఎస్‌లో ఉంటున్నారు. ప్రపంచ బ్యాంక్‌లో సీనియర్‌ హెల్త్‌ ఎకనామిస్ట్‌గా ఆమె పనిచేస్తున్నారు. కాగా, అకాన్షా స్విమ్‌ చేస్తున్న ప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని బీచ్ అధికారులు తెలిపారు.

అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు సూచికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ, ఆకాన్షా వాటిని పట్టించుకోలేదని, లైఫ్‌గార్డ్‌లు హెచ్చరించినా కూడా ఆమె వినలేదని తెలిపారు.

English summary
A young Indian-origin senior economist working with the World Bank drowned after strong currents pulled her away while she was swimming in a restricted area at a beach in Bali, the Indonesian media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X