వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్యాటకం: సింగపూర్‌లో ఖర్చు మనోళ్లదే అధికం!

|
Google Oneindia TeluguNews

 Indians among the top three spenders in Singapore
సింగపూర్: భారతీయ పర్యాటకులు ఇక్కడో రికార్డును నెలకొల్పారు. అదేంటంటే.. సింగపూర్ దేశంలో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అత్యధికంగా ఖర్చు చేసిన మొదటి ముగ్గురు విదేశీ యాత్రికుల్లో భారతీయులే ఉన్నారట. ఈ మేరకు వివరాలను సింగపూర్ టూరిజం బోర్డ్(ఎస్‌టిబి) సోమవారం వెల్లడించింది.

అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారతీయుల రాక కొంత తగ్గిందని తెలిపింది. దీంతో సింగపూర్ డాలర్ రేట్(ఎస్‌జిడి) 284 మిలియన్ల వద్ద 3శాతం తగ్గిందని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో 65,557 మంది భారతీయులు సింగపూర్‌ను సందర్శించారని తెలిపింది. నిరుడితో పోల్చితే ఇది 7.9శాతం తక్కువగా ఉందని పేర్కొంది.

ఫిబ్రవరిలో నెలలో 62,999 మంది భారతీయులు సింగపూర్‌ను సందర్శించారని, ఇది నిరుడితో పోల్చితే 5.6శాతం పెరిగిందని తెలిపింది. అదే మార్చిలో 70,472 మంది భారత పర్యాటకులు ఇక్కడికి వచ్చారని సింగపూర్ టూరిజం బోర్డ్ తెలిపింది. ఇందులో నిరుడితో పోల్చితే తేడా ఏమి లేదని చెప్పింది. అయితే పర్యటనకు వచ్చిన వారి సంఖ్యతో నిమిత్తం లేకుండా భారతీయుల ఖర్చు మాత్రం ఇక్కడ పెరిగిందని తెలిపింది.

మొత్తంగా చూసుకున్నట్లయితే మొదటి త్రైమాసికంలో పర్యాటక ఆదాయం ఎస్‌జిడి 6 బిలియన్ల వద్ద 5శాతం పెరిగిందని తెలిపింది. 3.9 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ఈ మొత్తం వచ్చినట్లు తెలిపింది.

English summary
Indians were among the top three spenders in Singapore during their visit here in the first quarter of this year, Singapore tourism board (STB) said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X