లోక్‌సత్తా 7వ వార్షికోత్సవ వేడుకలు
న్యూయార్క్: లోక్‌సత్తా పార్టీ 7వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్‌లో పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా సభ్యులు ఘనంగా నిర్వహించారు. లోక్‌సత్తా పార్టీ 7వ వార్షికోత్సవాలను జరుపుకోవడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కూకట్ పల్లి నియోజకవర్గంలో జయప్రకాష్ నారాయణ రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాడని డల్లాస్ పార్టీ నేతలు కొనియాడారు. సున్నాశాతం అవినీతితో ప్రభుత్వ ధనాన్ని జెపి సద్వినియోగం చేశారని వారు తెలిపారు. తమకు సాధ్యమైనంత వరకు ప్రజలకు, సమాజానికి సేవ చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ వేడుకల్లో 25మంది పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా సభ్యులు పాల్గొన్నారు. లోక్‌సత్తా పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఏడు సంవత్సరాలపాటు సాధించిన విజయాలను ఈ సందర్భంగా చర్చించారు. 2014లో జరిగే ఎన్నికలపై కూడా చర్చించారు. నియోజక వర్గ కార్యక్రమాలు, సిసిటివి కెమెరాస్ కాంపెయిన్, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు, ఓటర్ నమోదు లాంటి విషయాలపై కూడా సభ్యులు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా పార్టీ నేత రజనీకాంత్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన డల్లాస్ చాప్టర్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications