పని మనిషికి గిఫ్ట్‌గా ఇల్లు, 15 ఏళ్ళుగా ఆ కుటుంబంతోనే, ఎక్కడంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: తన ఇంట్లో పని చేసిన పని మనిషికి ఇంటి యజమానురాలు ఇల్లును బహుమతిగా ఇచ్చింది. దుబాయ్‌లో ఇళ్ళలో పనిచేసిన ఓ మహిళకు ఆ ఇంటి యజమానురాలు ఇల్లును బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకొన్నారు.

గల్ప్ దేశాల్లో యజమానులు తమకు నరకం చూపిస్తున్నారంటూ అక్కడ పనిచేసేవారు వీడియో సందేశాలు పంపుతూ తమ బాధను వ్యక్తం చేసే సందర్భాలను చూస్తున్న తరుణంలో ఈ ఇంటి యజమాని చూపిస ఔదార్యం మాత్రం పలువురి ప్రశంసలు పొందుతోంది

తమ కుటుంబసభ్యురాలిగా మెలిగిన పనిమనిషి కోరికను తెలుసుకొని మరీ ఆమెకు ఇల్లును బహుమతిగా ఇచ్చారు.ఆ ఇంట్లో పని మనిషిగా కాంట్రాక్టు పూర్తైనా ఆ ఇంటితో ఆ పనిమనిషి బంధాన్ని తెంచుకోలేదు. దీంతో ఆ యజమాని ఆ పనిమనిషికి ఇల్లును బహుమతిగా ఇచ్చారు.

 పనినమిషికి ఇల్లును బహుమతిగా ఇచ్చిన యజమానురాలు

పనినమిషికి ఇల్లును బహుమతిగా ఇచ్చిన యజమానురాలు

ఫిలిప్పీన్‌కు చెందిన 45 ఏళ్ల కెలో అనే మహిళ బతుకుదెరువు కోసం 1998లో యూఏఈలోని ఖలీఫా నగరానికి వలస వచ్చింది. అక్కడే ఓ వ్యక్తిని వివాహం చేసుకొంది. దీంతో అక్కడి పౌరసత్వాన్ని పొందింది. మెక్ పైక్ అనే ఓ అమెరికన్ మహిళ వద్ద కెలో పనిమనిషిగా చేరింది. ఇంట్లో వంటపని, దుస్తులు ఉతకడం, వంటి పనులు చేయడానికి కెలోను పైక్ నియమించుకుంది.తన ఇంట్లో నమ్మకంగా ఉన్న కెలో‌కు మెక్ పైక్ ఇల్లును బహుమతిగా ఇచ్చింది.

 పిల్లల ఆలనా పాలన

పిల్లల ఆలనా పాలన

మెక్ పైక్ ఇంట్లో పనిచేసేందుకు కెలో కుదిరే రోజుకు పైక్ కు ఇద్దరు పిల్లలున్నారు. వారి ఇద్దరి వయస్సు నాలుగు, ఆరేళ్ళ వయస్సు ఉంటుంది. కెలో మాత్రం ఇంటి పనితో పాటు ఆ పిల్లల ఆలనా పాలనా కూడ చూసేది. యజమానురాలికి సహయంగా ఉండేది .ఎంతో నిజాయితీగా కెలో పనిచేసేది.

 15 ఏళ్ళుగా కుటుంబంతో సంబంధాలు

15 ఏళ్ళుగా కుటుంబంతో సంబంధాలు

15 ఏళ్లుగా కుటుంబ మెక్ పైక్ కుటుంబంంలో ఒకరిగా కెలో మెలిగింది. ఈ కుటుంబంలో పనిచేయడానికి రెండేళ్ళతో కాంట్రాక్టు ముగిసింది.అయితే ఈ గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాల్లో పనిచూస్తూ ఈ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది.ఈ ఇంట్లో ఒక సభ్యురాలిగా కెలో గడిపింది.

 పెద్ద కొడుకు పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్

పెద్ద కొడుకు పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్

కెలోను నేను పనిమనిషిగా ఎప్పుడూ చూడలేదు. ఇంటి సభ్యురాలిగా భావించా. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు ఆమె చేసిన సాయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. నా వద్ద పనిచేయడం కుదరకపోయినా మమ్మల్ని మర్చిపోలేదు. వేరే చోట పని చేసిన వెంటనే నేరుగా మా ఇంటికి వచ్చేది. పిల్లలను చూసుకునేది. నా దగ్గర చాలా మంది పనిమనుషులుగా చేశారు. కానీ వారికీ, కెలోకు నిజాయితీలో తేడా ఉంది. నా డెబిట్ కార్డులను కూడా ఆమెకు ఇచ్చేంత నమ్మకం ఉంది. పిల్లలు ఆమెను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. ఆంటీ అని పిలుస్తుంటారు. అని యజమానురాలైన మెక్ పైక్ తెలిపింది. తన 21 ఏళ్ల కుమారుడు రియాన్ పేరిట కెలో రిజిస్టర్ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Filipina domestic worker in Abu Dhabi will soon be owning a house in her hometown, thanks to her Emirati employer who has paid for it.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి