వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో టీఆర్ఎస్ సపోర్టర్స్ గ్రీట్&మీట్: ముఖ్య అతిథిగా కొండా సురేఖ..

యూకే నలుమూలల నుండి సంస్థ సభ్యులు ,భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

లండన్: కెసిఆర్ ఆర్మీ తెరాస సపోర్టర్స్ అఫ్ యూకె(ktsuk)ఆధ్వర్యంలో తెరాస సభ్యుల మీట్ అండ్ గ్రీట్ పేరిట లండన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి సంస్థ సభ్యులు ,భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Meet and Greet program by KTSUK- KCR TRS Supporters of UK

తెలంగాణా నించి ముఖ్య అతిధులుగా వచ్చిన కొండా సురేఖ(TRS MLA) , కొండా మురళి గారు , టి. ప్రకాష్ గౌడ్ ( TRS MLC),గుండవరపు దేవీప్రసాద్ (తెలంగాణ రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌), తెరాస యువజన నాయకులూ అరవింద్ గౌడ్ గారు ముఖ్య అతిధులుగా విచేసినారు .

Meet and Greet program by KTSUK- KCR TRS Supporters of UK

నగేష్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ,"చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం" అనే నినాదంతో తాము నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో ,నేతన్నకు భరోసా కల్పించడానికి తమ వంతు సాయంగా చేస్తున్న ప్రచార కార్యక్రమాలని ఈ కార్యక్రమంలో (ktsuk)గడిచిన సంవత్సరాలలో చేసిన ముఖ్యకార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.

Meet and Greet program by KTSUK- KCR TRS Supporters of UK

అద్యక్షులు సిక్కా చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు ముఖ్య అతిధులకి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రపంచం లో వివిధ దేశాల్లో తెరాస ఎన్నారై టిసభ్యులకి ఎప్పటికప్పుడు కెసిఆర్ మరియు యావత్ టి.అర్.ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ ఆదేశాల మేరకు బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ ఆహార్ నిశలు కష్టపడుతున్నారని అందులో భాగంగా తాము వారి వెంట ఉంటామని తెలిపారు

ఈ సంధర్భంగా శ్రీ .దేవి ప్రసాద్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేనేత ప్రమోషన్ కు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నారైల అండదండలు ఎప్పుడూ ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేతే పరిశ్రమ బాగుకోసం వినూత్న పథకాలతో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్దికి పాటు పడుతున్నారని అన్నారు.

కేసీఆర్ ఆలోచనలతో అందరి అంచనాలకు అందనంత సరికొత్త పాలనలో ఆయనతో పోటీ పడే వారు ఎవరూ లేరని అన్నారు. తెలంగాణ చేనేత అభివృద్దికి సంబంధించితెరాస వద్ద ఖచ్చితమయిన ప్రణాళిక ఉందని, ప్రణాళికా బద్దంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో అనాధ పిల్లల కోసం చదువు, వసతి తదితర అంశాల పై ముఖ్యమంత్రి గారి చొరవ అభినందనీయమని అన్నారు.

ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడుతూ టీ .అర్.ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళ్తుందని..ఎంతో కష్టపడి తెలంగాణ వచ్చింది అన్ని కాబట్టి ఎన్నారైలు అందరు ఏకతాటి మీద నిలుచొని ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న ,స్వచ్ఛ హైదరాబాద్‌ నగరాన్ని పరిశుభ్రంగా చేయడానికి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి బస్తీలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీర్చిదిద్దారని, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. అందరం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ ఆహార్ నిశలు కష్టపడుతున్నారని, ఆ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.

కొండామురళి ఈ సందర్భం గా మాట్లాడుతూ కన్నా తల్లి ని ఎలా మర్చిపోమో , పుటిన ఊరుకి వీలైనంత సహాయ చేయాలనీ పిలుపునిచ్చారు ,ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా TS iPASS ద్వార పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు అనుమతి లబిస్తుందని, మిషన్ కాకతీయ మంచి పలితాలిస్తుందని ఇప్పటికే పునరుద్దరణ చేయబడిన చెరువులు నిండుకుండల్లా మారాయని, రాష్ట్రంలో అనాధ పిల్లల కోసం చదువు, వసతి తదితర అంశాల పై ముఖ్యమంత్రి గారి చొరవ అభినందనీయమని అన్నారు.

కొండా సురేఖ తాను ఒక చేనేత కుటుంబం నుండి వచ్చానని , చేనేత పరిశ్రమ ప్రత్యేకించి చేనేతే రంగంలో తీసుకున్న నిర్ణయాలు - విధానాల గురించి సభకు వివరించారు. భవిష్యత్తులో వరంగల్ లో రాబోయే చేనేత పరిశ్రమలు అభువృధి కోసంతెరాస ప్రభుత్వం లో కెసిఆర్ గారు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నామని, కాబట్టి అందరు సహకరించి, భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్య లక్ష్మి, ఆసరా , హరితహారం, వాటర్ గ్రిడ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహ నిర్మాణం లాంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వార తెలంగాణ త్వరలో అభివృద్ధి చెందుతుందని, గడచినా మూడు ఏళ్లు కాలంలో ఇప్పటివరకు వున్న ఎ ప్రభుత్వం ద్వార ఇంత అభివృద్ధి జరగలేదన్నారు

అనంతరం ఎన్నారై. టి.అర్.యస్ ప్రతినిధులు ముఖ్య అతిదులని ఘనంగా సన్మానించారు .
బావార్చి రెస్టురంట్ అధినేత కిషోర్ కుమార్ మునుగంటి ,శశి కొప్పుల ,మహిళా విభాగం నందిని మొట్ట ,రజిత నీల ,వర్ష కారిక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినారు . తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నాయకులు అధ్యక్షులు రామ్ చెప్యాల ,శ్రీనివాస్ రెడ్డి పింగళి ,గౌడ్ బాయ్

సంస్థ సభ్యులు భాస్కర్ మొట్ట , శ్రీధర్ నీల , శ్రీధర్ కటికనేని ,భాస్కర్ పిట్ల,రాజేష్ఎనుబోతుల ,శశికొప్పుల , ,శశి కొప్పుల ,రవి కూర , వేణు రెడ్డి ,మహిళా విభాగం నందిని మొట్ట ,రజిత నీల ,వర్ష కారిక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు . తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నాయకులు అధ్యక్షులు రామ్ చెప్యాల ,శ్రీనివాస్ రెడ్డి పింగళి ,గౌడ్ బాయ్ ,మరియు కిషోర్ కుమార్ మునుగంటి పాల్గొన్నవారిలో ఉన్నారు.

English summary
The KTSUK- KCR TRS Supporters of UK,hosted a ‘Meet and Greet with The chief guests who came to UK from Telangana State to take part in this great TeNF Bathukamma jathara were Konda Surekha (TRS MLA), Konda Murali Rao (TRS MLC), T. Prakash Gowd (TRS MLC), , Gundavarapu Deviprasad (Chairmen of Telangana Breweries Corporation.) were cheif guest from ruling party TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X