NRI News: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న పలువురు భారతీయులు..!
అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారి దేశాలకు తిరిగి పంపిస్తున్నారు. అక్రమ వలసదారులను నియంత్రించాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీహెచ్‌ఎస్) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అక్రమంగా ఉన్నవారిని తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న ఇండియన్స్ అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్రమ వలసదారులు అమెరికాకు ఎక్కువగా కెనడా నుంచి వెళ్తారు.
సరిహద్దు వద్ద యూఎల్ లోకి చెరపడతారు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా వెళ్లే వారిలో భారతీయులు ఎక్కువగానే ఉన్నారు. అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు 90,000 మంది భారతీయులతో సహా 29 లక్షల మంది కెనడా, మెక్సికో నుంచి యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అక్రమంగా రావడానికి ప్రయత్నిస్తూ అధికారులకు చిక్కుతున్నారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (US-CBP) ప్రకారం, ప్రతిరోజు సగటున కనీసం 10 మంది భారతీయులు అక్రమంగా USలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నారు.

ఈ భారతీయుల్లో దాదాపు 50% గుజరాత్ నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది. ప్రజలు గతంలో ఎక్కువగా మెక్సికో సరిహద్దు నుంచి యూఎస్ లోకి ప్రవేశించేవారు. ఇప్పుడు కెనడా ఎక్కువగా వెళ్తున్నారని పేర్కొంటున్నారు. చాలా మంది గుజరాతీలు కెనడా ఉత్తర ప్రాంతం గుండా యూఎస్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్గం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. గతంలో ఓ భారతీయ కుటుంబం కెనడా నుంచి యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచులో కూరుకుపోయి మృతి చెందారు.
అమెరికాలోకి అక్రమంగా వెళ్లేవారిలో చైనా, భారత్, కొలంబియా, ఉజ్బెకిస్థాన్, మారిటానియా, ఊక్వెడార్, పెరూ, ఈజిప్ట్ దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారట.అమెరికా ఈ ఏడాదిలో దాదాపు 1,60,000 మంది అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపింది. అనుమతి లేకుండా అమెరికాలోకి ప్రవేశించవద్దని అక్కడి అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications