కువైట్ మినీ మహానాడు.. నారా లోకేష్ కు ఆహ్వానం

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కువైట్ లో జరగబోయే మినీ మహానాడులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రముఖ ఎన్నారై, కువైట్ టీడీపీ అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ ను కలిసి మినీ మహానాడుకు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. కువైట్ లో మే 20వ తేదీన మినీ మహానాడు బహిరంగ సభ జరుగుతుందని, కువైట్ లో ఉన్న దాదాపు 2 లక్షల మంది తెలుగు వారిలో ఎక్కువమంది టీడీపీ అభిమానులేనని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని తెలియజేశారు.

నారా లోకేష్ రాక కోసం అక్కడి తెలుగువారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు సుధాకర రావు. కాగా సుధాకర రావు అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన లోకేష్.. ఏపీ ఎన్నారై మంత్రి రఘునాధ రెడ్డి, ఏ.పి.ఎన్నారై చీఫ్ వేమూరి రవి కుమార్ గారితో కలిసి కువైట్ పర్యటనకు వస్తానని తెలియజేశారు లోకేష్ బాబు. ఈ సందర్భంగా కువైట్ టీడీపీ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి లోకేష బాబుకు వివరించారు సుధాకర రావు.

అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ కు అంబులెన్స్ ను బహూకరించారు సుధాకర రావు. పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత నారా లోకేష్ జెండా ఊపి అంబులెన్స్ ను ప్రారంభించారు. తరువాత జరిగిన విలేకరుల సమావేశములో ఎన్టీఆర్ ట్రస్ట్ సి.ఈ.వో. విష్ణు వర్ధన్, సుధాకర రావు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే అంబులెన్స్ ను బహూకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

nara lokesh got the invitation for kuwait mini mahanadu

ఆ తర్వాత మాట్లాడిన సుధాకర రావు.. విదేశాల్లో ఉండే వ్యక్తులెవరైనా దురదృష్ట వశాత్తు అనారోగ్యం పాలవడమో..! లేక మరణించడమో..! జరిగితే అలాంటివారిని చెన్నై, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి నేరుగా వారి ఇళ్లకు చేరవేయాలనే సదుద్దేశ్యంతో అంబులెన్స్ ను బహూకరించినట్టుగా తెలిపారు.

ఎన్టీఅర్ ట్రస్ట్ తరుపున మరిన్ని మంచికార్యక్రమాలకు గల్ఫ్ దేశాలలో శ్రీకారం చుడుతామన్నారు. దీంతో పాటు ఎన్టీఅర్ ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లోను తన ప్రాతినిథ్యం తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు.

గుంటూరు జిల్లాలోని బొబ్బర్లంక కుదరవల్లి సుధాకర రావు స్వగ్రామం. గడిచిన పదిహేనేళ్లుగా ఆయన కువైట్ లో ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎన్నారై చీఫ్ రవి వేమూరి, బుచ్చిరాం, నిరంజన్, మురళి గారు, శరత్, వెంకట అప్పా రావు, నాగేంద్ర బాబు, కాపెర్ల పట్టభి రాము సహా తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+