తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నారై సెల్ ఏర్పాటు

Subscribe to Oneindia Telugu

సిడ్నీ: మంగళవారం నాడు ఆస్ట్రేలియాలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఏర్పాటు చేశారు. సిడ్నీ కేంద్రంగా 50 మంది ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసారు. గాంధీ భవన్ (ఇండియా ) నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలువురు టీపీసీసీ నేతలు మాట్లాడారు .

పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ,మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎన్నారై చైర్మన్ బి వినోద్ కుమార్ రిటైర్డ్ IFS,కల్వకుర్తి ఎమ్మెల్యే చల్ల వంశీచంద్ రెడ్డి ,పీసీసీ ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్ ,టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కొనగల పలువురు తమ సందేశాన్ని ఇచ్చిస్ఫూర్తి నిచ్చారు.

nri congress cell elected in australia

వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీ మధు యాష్కీ ఫోన్ ద్వారా తమ సందేశాన్ని ఇచ్చి సామాజిక
సేవలో ముందంజ లో ఉండాలని పిలుపు నిచ్చారు. అలాగే లండన్ నుండి ఎన్నారై కోఆర్డినేటర్ గంప
వేణుగోపాల్ మాట్లాడి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

డా. బి. వినోద్ చైర్మన్, మన్యం రాజశేఖర్ రెడ్డిని కన్వీనర్‌గా మేక దేవి, ప్రసాద్ రెడ్డి కో కన్వీనర్‌గా కమిటీ మెంబర్లు గా శ్యామ్ ప్రసాద్ ,ఇమ్రాన్ మొహమ్మద్ ,ఉదయ్ కిరణ్ ,రాంబాబు , సంజయ్ గౌడ్ లను నియమిస్తున్నట్లు ప్రకటించారు. టీపీసీసీ ఎన్నారై కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tpcc Australia Co-ordinator Gampa Venugopal announced details of NRI cell australia on today.
Please Wait while comments are loading...