అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్తున్న పేద విద్యార్థినికి ఎన్నారై టీడీపీ సెల్ సాయం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఆర్ఐ టీడీపీ సెల్.. ప్రవాసాంధ్రుల సహాయ సహకారాలతో ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను చేస్తోంది. ప్రతిభ ఉన్న వారిని పై చదువులకోసం విదేశాలకు ప్రోత్సహించడమే కాకుండా వారికి కావాల్సిన సమగ్రమైన గైడెన్స్‌తో పాటు వివిధ రకాల సహాయ సహకారాలను ఎన్నారైల సహకారంతో ఈ సెల్ అందిస్తుందని కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తెలిపారు.
ఇందులో భాగంగా పలికే శ్రీనివాసరావు(వాసు) గత 25 సంవత్సరాల నుంచి టీడీపీ ప్రధాన కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారు. అతని కుమార్తె పలికే సంధ్య టీడీపీ సహకారంతో 6వ తరగతి నుంచి ఫార్మసీ వరకు మంచి మార్కులతో పూర్తిచేసింది. ఇప్పుడు ఉన్నత చదువుల నిమిత్తం సంధ్యకు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కలిగింది.

కాగా, అమెరికాలోని చార్లెట్‌లో నివశిస్తున్న తెనాలి వాసి అయినంపూడి శ్రీహరి విదేశీ ప్రయాణంకి సంబంధించిన టికెట్‌ను స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చారు.గురువారంనాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ చీఫ్ డాక్టర్ రవి వేమూరి, బుచ్చి రాంప్రసాద్ చేతుల మీదగా వీరికి టికెట్ అందించడం జరిగింది.
గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు విద్యార్థులకు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ద్వారా అయినంపూడి శ్రీహరి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వీరు చేస్తున్న సేవను ఈ టిక్కెట్ అందించిన నాయకులతో పాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అయినంపూడి శ్రీహరిని అభినందించడం జరిగింది.
అదే విధంగా విషయం తెలుసుకొని స్వయంగా ముందుకు వచ్చి టికెట్‌కు సహాయం అందించినందుకు శ్రీహరిని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ చీఫ్ డాక్టర్ రవి వేమూరి, కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్‌లు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications