ప్రసాద్ తోటకూరకు ఘన సత్కారం

 Thotakura felicitated in Dallas
న్యూయార్క్: డల్లాస్‌లోని పార్క్ ప్లాజా టవర్స్ సమావేశ మందిరంలో సామాజిక కార్యకర్త డాక్టర్ ప్రసాద్ తోటకూరను అమెరికాలోని పలు తెలుగు ప్రవాసీ సంఘాలు సత్కరించాయి. డాక్టర్ ప్రసాద్ తోటకూర.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్, నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 90వ జన్మదినం సందర్భంగా ఆయన నుంచి సెప్టెంబర్‌లో ఏఎన్నార్ జీవితకాల సాఫల్య స్వర్ణ కంకణం అవార్డును అందుకున్నారు. అంతేగాక అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ కేంద్రంగా నిర్వహించబడుతున్న గీతం యూనివర్సిటీ నుంచి ప్రసాద్ తోటకూర డాక్టరేట్ పొందారు.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నవంబర్ 16న అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 20 తెలుగు, ఇతర భారత ప్రవాసీ సంఘాలు డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఆయన సతీమణి స్వరూపను డల్లాస్‌లో శాలువాతో ఘనంగా సత్కరించాయి. ఈ సమయంలో పండితుడు సుబ్రమణ్యం రాళ్లబండి వేద మంత్రాలను ఉచ్ఛరించారు. కార్యక్రమానికి 350మంది ప్రవాసీ తెలుగు ప్రజలు హాజరయ్యారు. గత 25 సంవత్సరాలుగా నిస్వార్థ సేవలందిస్తున్న ప్రసాద్ తోటకూరను సత్కరించడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని ప్రవాసీ తెలుగు సంఘాలు పేర్కొన్నాయి.

ఈ కార్యాక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టిఏఎన్‌టిఈఎక్స్), అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్‌టి), ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సి), డిఎఫ్‌డబ్ల్యూ హింద్ టెంపుల్ సొసైటీ(డిఎఫ్‌డబ్ల్యూ హెచ్‌టిఎస్), బిఏపిఎస్ స్వామినారాయణ్ మందిర్(బిఏపిఎస్), హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ ఫర్ వర్త్ (హెచ్‌టిజిఎఫ్ డబ్ల్యూ), టెక్సాస్ ఇండో అమెరికన్ ఫిజిషియన్స్ సొసైటీ (టిఐపిఎస్), డిఎఫ్‌డబ్ల్యూ ఒరిస్సా సొసైటీ (డిఓఎస్), మెట్రోప్లెక్స్ తమిళ్ సంఘం(ఎంటిఎస్), గీతం అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (జిఏఎన్ఏఎం), అన్నదాత, కృష్ణ ఎన్నారైస్, ప్రకాశం ఎన్నారైస్, చట్టీయార్ ఎన్నారైస్, ఎల్ఎంఏ ఆఫ్ డల్లాస్, సుస్వర అకాడమీ, కళావాహిని అకాడమీ సంఘాలు భాగస్వాములయ్యాయి.

డాక్టర్ ప్రసాద్ తోటకూర తన 25 ఏళ్ల సామాజిక సేవలో భాగంగా పలు సంఘాలలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆయన అందించిన సేవలకు గాను అనేక అవార్డులను పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరంలో వివిధ రాజకీయ పార్టీలను ఆయనను సేవ రత్న అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయ తెలుగు కల్చరల్, లిటరరీ అసోసియేషన్(ఐటిసిఎల్ఏ) హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అందుకున్నారు.

అంతేగాక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి సేవ నిధి అవార్డు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి ఉగాది పురస్కారం, తానా నుంచి జాతీయ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు, కేర్ ఇంటర్నేషనల్ నుంచి స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు, గ్రేటర్ డల్లాస్ ఆసియన్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఔట్ స్టాండింగ్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు, న్యూఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యబ్రతా ముఖర్జీ నుంచి బెస్ట్ ఎన్నారై అవార్డు, సౌత్ కరోలినా గవర్నర్ నుంచి ఎగ్జంప్లరీ కమ్యూనిటీ సర్వీస్ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్బంగా డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తను 25ఏళ్లుగా సేవ చేసేందుకు కుటుంబ సభ్యులు, గురువులు, చాలా మంది తనకు సహకరించారని అన్నారు. కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ సంఘాల సహకారంతో గుజరాత్ భూకంప బాధితులను ఆదుకునేందుకు 650వేల డాలర్లను, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులు జరిగినప్పుడు 160వేల డాలర్ల సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు డాక్టర్ ప్రసాద్ అందించిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఆర్ రావు, మురళీ వనం, చలపతి రావు కుంద్రకుంట, శ్రీకాంత్ పావరపు, రావు కల్వల, వినోద్ ఉప్పు, డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, సాంబ దొడ్డలు, తయాబ్ కుండవాలా, రాజ్ అసవా, సంధ్యా రెడ్డి గువ్వా, డాక్టర్ పులిగండ్ల విశ్వనాథం, డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నవనీత్ కృష్ణ గొర్రెపాటి, డాక్టర్ తారకుమార్ రెడ్డి, రావు కల్వల, ఎంవిఎల్ ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, మురళీ వెన్నం, డాక్టర్ కెజె యేసుదాస్, చలపతి రావు కొండ్రకుంట, సుభాద ప్రసాద్, సుష్మి కౌసురి, సతీష్ మండువా, డాక్టర్ నర్సింహారెడ్డి ఉరిమిండి, డాక్టర్ సిఆర్ రావు, రాజకీయ నాయకులు స్వాతి దండేకర్ అరుణా మిల్లర్, కేశారాం, జై గోయల్, రాజ్ గోయల్, సత్వీర్ చౌదరి, కుమార్ బార్వే, జనక్ జోషి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ శ్రీనివాసన్, తుల్సి గబ్బార్డ్, బాబి జిందాల్, నిక్కి హోలేలుపాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+