ఎన్ఆర్ఐలకు షాక్: 5 శాతం వ్యాట్ ట్యాక్స్ , గల్ప్‌లో జేబులకు చిల్లులేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: గల్ప్ దేశాల్లో కొత్త సంవత్సరం కొత్త పన్ను అమల్లోకి రానుంది. 5 శాతం వ్యాట్ పన్ను విదేశాల నుండి గల్ప్ దేశాల్లో జీవనం సాగిస్తున్న వారిపై ప్రభావం చూపనుంది. గల్ప్‌కు సంబంధం లేదని దేశాల వాసుల జేబులకు చిల్లులు పడనున్నాయి.

గల్ప్ దేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి, కార్మికులుగా పనిచేసేవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. అయితే ఆయిల్ వ్యాపారం ద్వారానే ఆర్థికంగా ఈ దేశాలు డబ్బులను గడిస్తున్నాయి. అయితే మారుతున్న పరిస్థితులతో పాటు చమురు నిల్వలు అడుగంటిపోతుండడంతో ప్రత్యామ్నాయమార్గాలపై గల్ప్ దేశాలు కేంద్రీకరిస్తున్నాయి

ఆదాయం కోసం కొత్తగా వ్యాట్ పన్నును గల్ప్ దేశాల్లో అమలు చేశారు. కొత్త సంవత్సరం ఆరంభం నుండి కొత్త పన్నుల భారం పడనుంది. అయితే దీని ప్రభావం ఎవరిపై ఎంత మేరకు ఉంటుందనేది ఆచరణలో తేలనుంది.

కొత్త సంవత్సరంలో కొత్త పన్నులు

కొత్త సంవత్సరంలో కొత్త పన్నులు

2018 కొత్త సంవత్సరంలో కొత్తగా వ్యాట్ ట్యాక్స్‌ను గల్ప్ దేశాల్లో అమలు చేయనున్నారు. ఐదు శాతం వ్యాట్ ట్యాక్స్‌ను అమలు చేశారు. దరిమిలా విదేశాల నుండి గల్ప్ దేశాల్లో పనిచేసేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికులు 5 శాతం వ్యాట్ ట్యాక్స్ చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరనుంది.

చమురు ధరల తగ్గుదలతో

చమురు ధరల తగ్గుదలతో

అంతర్ధాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చమురు ధరలు తగ్గిపోవడంతో ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు వీలుగా చమురు దరలను పెంచాలని నిర్ణయం తీసుకొన్నారు. సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో వ్యాట్‌ను ప్రవేశపెట్టాయి.

విదేశీ ఉద్యోగుల నియామకం అదనంగా బాదుడు

విదేశీ ఉద్యోగుల నియామకం అదనంగా బాదుడు

యూఎఈలో భారతీయుల సంఖ్యను తగ్గించేందుకు విభిన్న సంస్కృతి, నైపుణ్య కార్మికుల ఎంపిక అనే రెండు విధానాలను అమల్లోకి తీసుకువచ్చారు. ప్రవాస భారతీయులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సౌదీ అరేబియా కూడ విదేశీయులకు ఉద్యోగాలు కల్పించిన ప్రతి సంస్థ ఒక్కో విదేశీ ఉద్యోగిపై నెలకు 300 రియాద్‌‌లు పన్నుల రూపంలో చెల్లించాలి.అయితే ఇప్పటికే నెలకు 200 రియాద్‌లు చెల్లిస్తున్నారు. దానికి అదనంగా ఈ 300 రియాద్‌లను చెల్లించాలని నిబంధన విధించారు.

 ప్రవాస భారతీయులకు ఇబ్బందేనా

ప్రవాస భారతీయులకు ఇబ్బందేనా

వ్యాట్‌తో పాటు ఇతర నిబంధనల పేరుతో విధిస్తున్న పన్నుల కారణంగా గల్ప్ దేశాల్లో ఉద్యోగాల్లో లేదా కార్మికులుగా పనిచేస్తున్న ప్రవాస భారతీయులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పన్నుల భారం పెరిగితే అక్కడ పనిచేసేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. లేదా పన్నుల భారం పెరిగితే కంపెనీలు కూడ విదేశీయులను ఉద్యోగాల నుండి తొలగించేందుకు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Value Added Tax (VAT) has been introduced in Saudi Arabia and the United Arab Emirates for the first time.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి