• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ: ప్రవాస తెలుగు పురస్కారాలు-2021

|

సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వారి అధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యముతో అంగ రంగ వైభవముగా జరగనున్న కార్యక్రమము తెలుగు బాషా దినోత్సవ కార్యక్రమం-2021లో భాగంగా... విదేశాలలో నివసిస్తూ తెలుగు బాషా సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ పురస్కారాలకు నామినేషన్లను పంపటానికి చివరి తేది ఆగస్టు 10 వ తేదీ కాగా పలు దేశాలలోని ప్రముఖులు ఇందుకు నానినేషన్లు పంపటం జరిగినది. వచ్చిన నామినేషన్లను నిష్ణాతులైన జ్యురీ పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎన్నిక చేయటం జరిగినది. ఈ సందర్బముగా నిర్వాహకులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల, లక్ష్మణ్, తొట్టెంపూడి గణేష్ ఈ పురస్కారాలకు ఎన్నికైన వారి వివరాలను ప్రకటించారు. ఈ పురస్కారాలు ఆగష్టు 𝟐𝟖, 𝟐𝟗 తేదీలలో జరగబోయే తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే ప్రదానం చేయబడతాయి.

 South Africa Telugu Community:Pravasa Telugu Puraskaralu-2021

ప్రవాస తెలుగు పురస్కారాలు-2021

పేరు: శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: యూఏఈ

శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ మరియు ఆటోమేషన్ ఇంజనీర్ అయినప్పటికీ సంగీత సాహిత్యాలు ఆయన ప్రవృత్తి. తెలుగు భాష పట్ల ఆయనకున్న వల్లమాలిన అభిమానం తో అనేక లలితగీతాలు వ్రాసి గాన గంధర్వులు శ్రీ ఎస్ పి బాలుగారితో పాడించడం ఆయన చేసిన భాషా సేవలో ఒక తురాయి. "ఉదాహరణము" అను ఛందోబద్ధమైన పద్యకావ్యము కూడా రచించి దానిని బాలుగారిచే పాడించడం తెలుగు సాహిత్య సంగీత రంగాలలోనే ప్రప్రధమం.

పేరు: శ్రీ వెలగ అప్పలనాయుడు
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: మలేషియా

శ్రీ వెలగ అప్పలనాయుడు గారు మలేషియా దేశంలో పుట్టి పెరిగినప్పటికీ మాతృభాషయైన తెలుగు భాష కోసం అయన చేసిన కృషి అభినందనీయం. అయన తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా లో1972నుంచి ఎన్నో పదవులు నిర్వహించి తెలుగు భాషాభివృద్ధికి సేవ చేస్తూ తెలుగు అధ్యాపకులుగా, ఎన్నో తెలుగు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ప్రస్తుతం మలేషియా తెలుగు అకాడమీ లో తెలుగు భాషా అధిపతి గా సేవలందిస్తున్నారు. అనేక ప్రపంచ తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సమావేశాలకు హాజరయ్యారు, పలు సమావేశాలలో ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డారు.

పేరు: శ్రీ జగదీశ్ పెంజర్ల
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: బహ్రెయిన్

శ్రీ జగదీశ్ పెంజర్ల గారు దశాబ్ద కాలంగా తెలుగు కళా సమితి బహ్రెయిన్ కు ఎనలేని సేవలు అందిస్తున్నారు. గత నాలుగు సంవత్సరముల నుండి తెలుగు బడి సమన్వయకర్తగా వుంటూ ప్రస్తుతం నాలుగు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా జరిగే తెలుగు కళా సమితి ఆవిర్భావ దినోత్సవములో పద్య మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతను అందించడమే కాకుండా తెలుగు కళా సమితి యోగా సమన్వయ కర్త గా కూడా బాధ్యతలను నిర్వహించుచున్నారు..

పేరు: శ్రీ వెంకప్ప భాగవతుల
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: ఖతార్

16సంవత్సరాలుగా ఖతార్ లో ఉన్న తెలుగు సంఘాలలో కార్యకర్తగా, వక్తగా, వ్యాఖ్యాతగా, సంఘసేవకుడిగా, సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్తగా, సమన్వయకర్త గా ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తూ, ఖతార్ దేశం లో ప్రప్రధమంగా ఉచితంగా "తెలుగు భాషా తరగతుల" నిర్వహణను చేపట్టడంతో పాటుగా "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం" మరియు "తెలుగు బాషా దినోత్సవం" వంటి కార్యక్రమాలను కూడా ప్రప్రధమంగా నిర్వహించిన ఘనతలో ప్రధాన సూత్రధారి. "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవము" కార్యక్రమంలో భాగంగా "భువన విజయం" (ఎంయూఎన్) కార్యక్రమంలో పాల్గొని "నంది తిమ్మన్న" గా గౌరవించబడ్డారు.

పేరు : శ్రీ షేక్ బాషా
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం : కువైట్
ఎలక్ట్రానిక్ మీడియా: కువైట్ ఆంధ్రా
గల్ఫ్ దేశాలలో అరబిక్ మరియు ఇంగ్లీష్ లో వచ్చే వార్తలు, సంఘటనలు, తెలుగు వారికి ఉపయోగపడే సమాచారం అన్నింటినీ తెలుగు లో పోస్ట్ చేసి ప్రవాస తెలుగు వారికి తెలపడం, వివిధ సేవాకార్యక్రమాలు చేయటం. కువైట్ లో ఇబ్బందులు పడుతున్న తెలుగు వారి గురించి ప్రత్యేక శ్రద్ధ తో వారి ఇబ్బందులు గురించి సేవా సంఘాలు మరియు కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయడం.

పేరు : శ్రీ శ్రీకాంత్ చిత్తర్వు
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం : దుబాయ్
ఎలక్ట్రానిక్ మీడియా: మాగల్ఫ్.కామ్
మాగల్ఫ్ వ్యవస్థాపకులు, ఎడిటర్ ఇన్ చీఫ్ మరియు టీవీ5 గల్ఫ్ చీఫ్ కో-ఆర్డినేటర్. మాగల్ఫ్.కామ్ తెలుగు ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ను 2015 వ సంవత్సరములో ఎటువంటి లాభపేక్ష లేకుండా ప్రారంభింపబడి గల్ఫ్ లోని తెలుగు వారి కోసం సులభంగా చదవగలిగేలా తాజా వార్తలను అప్‌డేట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

పేరు : శ్రీ శ్రీనివాస్ గొలగాని
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం : ఆస్ట్రేలియా
వార్తా పత్రిక : తెలుగుపలుకు
విధిలిఖితమో మదిరచితమో కానీ, 14 ఏళ్ల చిరుప్రాయంలో, సొంత కాళ్లపై నిలబడాలన్న కృతనిశ్చయంతో, వార్తాపత్రికలు పంచిన అదే చేతులతో, సంపాదకుడిగా ఒక తెలుగు మాసపత్రికను స్తాపించటం, నేటికీ, సుమారు 700 పై చిలుకు చందాదారులతో, 'తెలుగుపలుకు'ను నిర్విఘ్నంగా నడపటం...

పేరు: శ్రీ ప్రవీణ్ రాగి
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: ఒమాన్
గత 13 సంవత్సరాలుగా ఒమన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ సైన్సెస్ అనే విద్యాసంస్థలో గ్రాఫిక్ డిజైనర్ గా ఉద్యోగం చేస్తూ మిగిలిన సమయంలో తెలుగు వారికీ సహాయ పడాలనే ఉద్దేశ్యంతో ఈయన 2012 నుండి మన మాతృభాష అయిన తెలుగును యూ ట్యూబ్ మాధ్యమం ద్వారా బోధిస్తూ వున్నారు. వీరు ఆంగ్లం నుంచి తెలుగు కు సరళమైన వాక్యాలు మరియు పదాలలో వున్న ఒక నిఘంటువును కూడా అభివృద్ధి చేశారు.

పేరు: శ్రీ శ్రీనివాస్ గూడూరు
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: యూఎస్ఏ
వృత్తి రీత్యా అప్లికేషన్ ఆర్కిటెక్ట్ గా, బ్యాంక్ ఆఫ్ అమెరికా లో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గూడూరు గారు 20 సంవత్సరాలుగా అమెరికా(యూఎస్ఏ) లోని వివిధ తెలుగు సంస్థలలో అత్యున్నత పదవులు నిర్వహిస్తూ అనేక సాహిత్య/సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంఘాలకు చైర్‌పర్సన్ గా కొనసాగుతున్నారు. యూఎస్ఏ, భారతదేశంలో అనేక మానవతా కార్యకలాపాలను నిర్వహించారు

పేరు : శ్రీమతి రాధికా మంగిపూడి
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: సింగపూర్
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత, సంఘ సేవకురాలు, "శ్రీ సాంస్కృతిక కళా సారథి" సింగపూర్ కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, మరియు " గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం" సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు. సింగపూర్ లో నివసించే తెలుగు రచయితలలో స్వచ్ఛందంగా కథా సంకలనాన్ని వెలువరించిన తొలి రచయిత్రిగా "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్థానం సంపాదించుకున్నారు. 2020 లో సింగపూర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & ఎన్నారై కల్చరల్ సొసైటీ వారి సంయుక్త నిర్వహణలో "ఉమెన్ ఎక్సలెన్సీ" పురస్కారం అందుకున్నారు.

పేరు: శ్రీమతి జయ పీసపాటి (యద్దనపూడి)
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: హాంగ్ కాంగ్
వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలిగా, తెలుగు భాష సేవకురాలిగా పిల్లలకు తెలుగు తరగతులు, మహిళలకు స్తోత్రాల తరగతులు నిర్వహించడం, అంతర్జాల టోరి తెలుగు రేడియో లో వ్యాఖ్యాతగా మరియు తెలుగు సాహితి - సాంస్కృతిక కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా మరియు సమన్వయకర్త గా కూడా సేవలు అందిస్తూ, సిలికాన్ ఆంధ్ర మనబడి కి హాంగ్ కాంగ్ ప్రాంతీయ సమన్వయకర్తగా, ఉపాధ్యాయురాలిగా మరియు కొంత కాలం మనబడి భాషా సైనికురాలిగా సేవలు అందించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఉత్తమ తెలుగు ఉపాధ్యాయురాలిగా గుర్తించబడ్డారు.

పేరు: శ్రీమతి శారద కాశీవఝల
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం: యూఎస్ఏ
వృత్తికి సాఫ్ట్‌వేర్ మేనేజర్ అయినప్పటికీ ప్రవృత్తికి తెలుగు భాషాభిమాని. అవధానాలలో పృచ్ఛకులుగా, తెలుగు అధ్యాపకురాలిగా, పత్రికా సంపాదకురాలిగా, కవయిత్రిగా, రచయిత్రిగా, గేయ కవిగా, సాహిత్యవేత్తగా, సభా నిర్వాహకురాలిగా, కార్యకర్తగా, వక్తగా, వ్యాఖ్యాతగా, విమర్శకురాలిగా, కథకురాలిగా, సంభాషణల రచయిత్రిగా, నాటక దర్శకురాలిగా వైవిధ్య భరితమైన పాత్రలను నిర్వహిస్తున్నారు. గత ఒకటిన్నర సంవత్సరంగా లాభాపేక్ష లేకుండా "వ్యాలీ వేదిక" అనే యూ ట్యూబ్ ఛానల్ని నడిపిస్తూ అక్షర సేవ చేస్తున్న అంతర్జాతీయ నారీ శక్తి!.

English summary
South Africa Telugu Community:Pravasa Telugu Puraskaralu-2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X