అట్లాంటాలో భద్రాద్రి తరహా ఆలయ నిర్మాణం.. సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు..

అమెరికా అట్లాంటాలో భద్రాద్రిలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని పోలిన రామాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. అట్లాంటాలోని తెలుగువారంతా కలిసి భద్రాద్రి మాదిరిగానే ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం గత నెల 11న ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.

ఆలయ శిఖరంపై సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేయాలని అట్లాంటా తెలుగు రామాలయ నిర్మాణ భక్త సంఘం సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో 75 కిలోల బరువైన సుదర్శన చక్రాన్ని తయారు చేయించారు. దానికి భద్రాద్రిలోని పవిత్ర గోదావరి జలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి సన్నిధిలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సైతం సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు చేశారు. అహోబిల మఠంలోని స్వామివారి ఆలయంలో ప్రత్యేక స్నపనం, పూజ అనంతరం సుదర్శన చక్రాన్ని అట్లాంటాకు తరలించనున్నారు.

Special pooja performed for sudarshana chakram in bhadradri

మీరు ఎన్నారైలా? మీ సమస్యలు తెలుగువారితో పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు వన్ ఇండియాకు అండగా ఉంటుంది. సమస్యలే కాదు మీ సంబురాలు, సంతోషాలను వన్ ఇండియా పాఠకులతో పంచుకోండి. మీరు పంపే వార్తలు, సలహాలు, సూచనలు [email protected]కు మెయిల్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+