మహాసభల కోఆర్డినేటర్‌గా నాదెళ్ళ గంగాధర్

తానా సంస్థ ఏర్పడిన కొత్తరోజుల్లో డెట్రాయిట్‌లో జరిగిన రెండవ తానా మహాసభలు సంస్థకు గట్టి పునాదిని ఏర్పరచాయని, ప్రపంచంలోకల్లా ముఖ్యమైన ప్రవాసాంధ్ర సంస్థగా తానా ఎదగటంలో శ్రీ తుమ్మల మాధవరావు, ముక్కామల అప్పారావు, నల్లమోతు సత్యనారాయణ, నాదెళ్ళ గంగాధర్, బండ్ల హనుమయ్యలవంటి ఎందరో డెట్రాయిట్ తెలుగువారి కృషి, ఆదరాభిమానాలు ముఖ్యపాత్ర వహించాయని ఆయన పేర్కొన్నారు.
20వ తానా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చి, డెట్రాయిట్ తెలుగువారి బహుముఖప్రతిభను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసే వేదికను కల్పిస్తున్నందుకు స్థానిక తెలుగు సంఘం నాయకులు తమ హర్షాన్ని, సంసిద్ధతను వ్యక్తం చేశారు.
సెప్టెంబరు 18న సమావేశమైన తానా కార్యనిరవాహకవర్గం, 20వ తానా మహాసభల నిర్వాహకుడుగా శ్రీ నాదెళ్ళ గంగాధర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. రెండు దశాబ్దాలుగా తానాకు, తెలుగువారికి పలువిధాలుగా ఉత్తమ సేవలందించి, నాయకత్వ పటిమను చూపించిన శ్రీ గంగాధర్ ఈ సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరని తానా కార్యవర్గం భావించింది.
1999-2001 మధ్య తానా అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీ గంగాధర్ 2000లో తానా సహస్రాబ్ది సమావేశాలను డాలస్ నగరంలోనూ, 2001లో 13 వ తానా సమావేశాన్ని ఫిలడెల్ఫియా నగరంలోనూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో తానా జానపద కళోత్సవాలు శ్రీ గంగాధర్ అధ్యక్షుడుగా ఉండగానే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు తానాకు మధ్య సత్సంబంధాలు పెంచడంలో శ్రీ గంగాధర్ ప్రముఖపాత్ర వహించారు. తానా తనపై మోపుతున్న బాధ్యతను తాను సవినయంగా అందుకుంటున్నానని, డెట్రాయిట్ ప్రాంతంలో ఉన్న తెలుగువారందరినీ కలుపుకుని వారి ప్రతిభాపాటవాల సహాయంతో 20వ సమావేశాన్ని గొప్పగా తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తానని శ్రీ గంగాధర్ మాట ఇచ్చారు.
సమావేశ నిర్వాహకునిగా శ్రీ గంగాధర్ నియమకాన్ని డెట్రాయిట్ తెలుగు ప్రముఖులు కొనియాడారు. సమాజం నలుమూలలవారినీ కలుపుకొని పనిచేయగల సామర్థ్యం ఉన్న గంగాధర్ నాయకత్వంలో ఈ సమావేశాలు తప్పకుండా విజయవంతమౌతాయన్న విశ్వాసాన్ని వారు వెలిబుచ్చారు. శ్రీ నన్నపనేని మోహన్ శ్రీ గంగాధర్ నాయకత్వంపై తన పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ, శ్రీ గంగాధర్‌తో, డెట్రాయిట్ తెలుగు వారితో కలసి ఉత్సాహంగా పనిచేస్తూ అత్యద్భుతంగా 20వ సమావేశాన్ని నిర్వహించటానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications