వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో సంక్రాంతి సంబరాలు: అలరించిన ప్రదర్శనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డాల్లస్/ఫోర్ట్‌వర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఇర్వింగ్ నిమిట్జ్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన "సంక్రాంతి సంబరాలు" ఘనంగా జరిగాయి. టాంటెక్స్ 2015 అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త వెంకట్ దండ ఆధ్వర్యంలో సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

సుమారు 800 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సుమారు 185 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని సంతరించుకుంది. వనితావేదిక సమన్వయకర్త శ్రీలక్ష్మి మండిగ నేతృత్వంలో చిన్నారుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష ఆదరణ లభించింది. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.

ఆ తర్వాత లక్ష్మినాగ్ సూరిభొట్ల దర్శకత్వంలో ప్రదర్శించిన ‘అత్తారింటికి దారి' హాస్య నాటిక అందర్నీ ఆహ్లాదంలో ముంచెత్తి, నవ్వులు పూయించింది. హెతల్ జోష్ నాగరాజ్ నిర్వహణలో ‘గ్రేస్ క్రియేషన్స్ - గర్ల్స్ లైఫ్' నృత్యం అహుతులను ఆకట్టుకుంది.

2014 అధ్యక్షులు విజయ మోహన్ కాకర్ల మాట్లాడుతూ.. తమకు సహాయ సహకారాలు అందించిన కార్య వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఆ తర్వాతత సంస్థ నూతన అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డిని సభకు పరిచయం చేశారు. అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి 2015 నూతన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు.

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఉత్తరాధ్యక్షుడుగా, ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఉపాధ్యక్షుడుగా, ఆదిభట్ల మహేష్ ఆదిత్య కార్యదర్శిగా, వీర్నపు చినసత్యం సంయుక్త కార్యదర్శిగా, శీలం కృష్ణవేణి కోశాధికారిగా, వేణుమాధవ్ పావులూరి సంయుక్త కోశాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఆ తర్వాత పాలక మండలి నూతన అధిపతిగా అజయ్ రెడ్డి, ఉపాధిపతిగా సుగన్ చాగర్లమూడి, సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి గుర్రం, రమణారెడ్డి పుట్లూరు, రామకృష్ణా రెడ్డి రొడ్డ, శ్యామ రుమాళ్ళ, శ్రీనివాస్ బావిరెడ్డి‌లను సభకు పరిచయం చేశారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఇర్వింగ్ నిమిట్జ్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన "సంక్రాంతి సంబరాలు" ఘనంగా జరిగాయి.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

టాంటెక్స్ 2015 అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త వెంకట్ దండ ఆధ్వర్యంలో సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గసభ్యులు సభా ప్రాంగణంలో బొమ్మల కొలువును అలంకరించారు. సుమారు 800 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

కార్యక్రమానికి హాజరైన ప్రముఖ హాస్య నటుడు శివారెడ్డి ప్రేక్షకులను తన మిమిక్రీ , కృత భాషణం, సరదా మాటలతో, హాస్యోక్తులతో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా శివారెడ్డికి ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సన్మానం చేయడం జరిగింది.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

సుమారు 185 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని సంతరించుకుంది.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

వనితావేదిక సమన్వయకర్త శ్రీలక్ష్మి మండిగ నేతృత్వంలో చిన్నారుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష ఆదరణ లభించింది. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

పల్లవి తోటకూర ఆధ్వర్యంలో చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైంది.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

ఆ తర్వాత వెంకట్ ములుకుట్ల అధ్వర్యంలో వినాయకుడిని ప్రార్థిస్తూ వివిధ సంగీత వాయిద్యాలతో ఫ్యూజన్ పాట, జ్యోతి కందిమళ్ళ నిర్వహణలో ‘మహా గణపతిం.. స్వాగతం" శాస్త్రీయ నృత్యం, సంజనా పడిగెల నిర్వహణలో చిన్నారుల టాలీవుడ్ మెడ్లీ నృత్యాలు, ఝాన్సీ చామకూర నిర్వహణలో ఎల్ఎంఏ పిల్లల సినిమా పాటల మెడ్లీ ఆకట్టుకున్నాయి.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

ప్రవీణ వజ్జ నిర్వహణలో "కొలనిదోపరికి గొబ్బిళ్ళో" సంక్రాంతి పండుగను వర్ణిస్తూ చిన్నారుల శాస్త్రీయ నృత్యం, యోగిత మండువ దర్శకత్వంలో ప్రదర్శించిన "సంక్రాంతి వచ్చిందే తుమ్మెద" చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాలు, గురు శ్రీలతా సూరి నిర్వహణలో నాట్యాంజలి బృందం వారి "చరిష్ను' శాస్త్రీయ ఫ్యూజన్ నృత్యం ప్రేక్షకులని అలరించాయి.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గసభ్యులు సభా ప్రాంగణంలో బొమ్మల కొలువును అలంకరించారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

భారత జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.

నూతన అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 2015 సంవత్సరంలో వివిధ నూతన కార్యక్రమాలతో తెలుగు ప్రవాసులకు మరింత దగ్గరవతామని చెప్పారు. సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుకోవడం ఎంతైనా అవసరమని తెలిపారు.

డా. ఊరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, పాలకమండలి ఉపాదిపతి సుగన్ చాగార్ల మూడి సంయుక్తంగా కాకర్ల దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం ఊరిమిండి నరసింహారెడ్డి, విజయమోహన్ కాకర్ల సంయుక్తంగా 2014 పాలకమండలి అధిపతి మూర్తి ములుకుట్ల దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

టాంటెక్స్ సంస్థకు గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన రఘు చిట్టిమల్ల, బాల్కి చామకూర, సుభాషిణి పెంటకోటలను, పాలక మండలి సభ్యులుగా పదవీవిరమణ చేసిన డా. సిఆర్ రావు, 2014 పోషక దాతలను డా.ఊరిమిండి నరసింహారెడ్డి, విజయ మోహన్ కాకర్ల మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు.

ఆ తర్వాత రేఖా రెడ్డి నిర్వహణలో చలనచిత్ర నృత్యాలు, పఠనేని సురేష్ సమన్వయంలో స్థానిక గాయకులు చక్కటి చలన చిత్రంలోని పాటల మెడ్లీ, శ్రీలత ముషం నిర్వహణలో ‘బావ మరదళ్ల సంక్రాంతి సరదా సందడి" చిన్నారుల నృత్యo , రూప బంద నేతృలో ‘బ్రోవ భారమా' పాశ్చాత్య, శాస్త్రీయ ఫ్యూజన్ నృత్యం, సరిత కొండ నిర్వహించిన చలన చిత్ర నృత్యాల మెడ్లీ అందరిని అలరించింది. మల్లిక్ దివాకర్ల నేతృత్వంలో సమర్పించిన ‘నృత్యాక్షరి' ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2014 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద తనకు సంవత్సరం పొడుగునా సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

"సంక్రాంతి సంబరాలు" కార్యక్రమ సమన్వయకర్త దండ వెంకట్ పోషక దాతలకు కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అద్భుతంగా పనిచేసిన పఠనేని సురేష్, ఇల్లెందుల సమీర, జలసూత్రం చంద్రశేఖర్‌లకు అభినందనలు తెలిపారు. భారత జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.

English summary
TANTEX sankranti Sambaraalu held in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X