సాన్ రామన్, సన్నీవేల్‌లలో ఘనంగా టీసీఏ బతుకమ్మ వేడుకలు

ఈవెంట్ ఆసాంతం తెలంగాణలో బతుకమ్మ వేడుకలను తలపించేలా సాగింది.

కాలీఫోర్నియా: తెలంగాణ సంస్కృతిని పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య(టీసీఏ) తాజాగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. టీసీఏ ఈస్ట్ బే ఏరియా బతుకమ్మ(కాలిఫోర్నియా) పేరుతో ఈ వేడుకలను నిర్వహించారు.

టీసీఏ నిర్వహించిన ఈవెంట్‌కు వేలాది మంది తెలంగాణ ప్రజలు తరలివచ్చారు. ఈవెంట్ ఆసాంతం తెలంగాణలో బతుకమ్మ వేడుకలను తలపించేలా సాగింది. సాంప్రదాయ పద్దతిలో తయారైన మహిళలంతా తమ బతుకమ్మలతో డౌర్టీ వాలీ హైస్కూల్(డీవీహెచ్ఎస్) అడిటోరియం, సాన్ రామన్, సీఎ&ఒర్తెగా పార్క్, సన్నీవేల్ లో నిర్వహించిన వేర్వేరు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

TCA Celebrates 14th year of Bay Area Bathukammalu events in San Ramon and Sunnyvale,

రంగురంగు పూలతో అలంకరించిన బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. టీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మొత్తం 100బతుకమ్మల్లో టాప్-4 బతుకమ్మలను ఎంపిక చేసి వాటికి బహుమతులను అందజేశారు. మమతా బుద్దినేని ప్రథమ బహుమతి, నవీనా కెల్లెపు ద్వితీయ బహుమతి, రూప కళ మూడవ బహుమతి, ప్రసన్న మద్దినేని నాలుగవ బహుమతి గెలుచుకున్నారు.

అలాగే సన్నీవేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మల్లో నీలిమ సింగిరెడ్డి ప్రథమ బహుమతి, శిరీష నలబోలు ద్వితీయ బహుమతి, అర్చన కుప్పల తృతీయ బహుమతి, జ్యోతి చిగుళ్లపల్లి నాలుగవ బహుమతి గెలుచుకున్నారు.

వేడుకలను ఎయిర్ కండిషన్డ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం వల్ల ఎండ బారి నుంచి రక్షించినట్లయింది. టీసీఏ బతుకమ్మ వేడుకలకు హాజరైన మహిళలంతా ఏర్పాట్లను అభినందించారు. వేసవి విడిది గృహంలో సౌకర్యవంతమైన ఏర్పాట్లను ప్రశంసించారు. కార్యక్రమంలో మహిళలు పలు బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేశారు.

కార్యక్రమంలో అర్షద్ ఖాజా హుస్సేన్, కిశోర్ కాపరబోయిన, ప్రవీణ్ తోకల, ప్రసాద్ గట్టు, జ్యోతి చిగుళ్లపల్లి, అనుపమ పొన్నమనేని, మధుకర్ నల్లమాచు, సదానందం కనికరం, సతీష్ రాయపూడి, హరిప్రసాద్, శ్రీమయి అన్నం, సుమంత్ తోకల, నేహా బోడ, ఆకాంక్ష మద్ది, విష్ణు మెట్టుపల్లి, శ్రీకాంత్ తక్కలపల్లి, ప్రవీణ్ గరపల్లి, రాజ్ కుమార్ శ్రీకంద,

శ్రీకాంత్ కాందూరి, ప్రభాకర్ పాస్కూర్, ఉదయ్ జొన్నల, గోపీ మంచాల, సంపత్ ప్రాతపగిరి, అజయ్ గడ్డం, శ్రావణ్ కునాది, సుష్మిత అన్నది, శ్వేత, రుచిత కోత, శివ కొడిత్యాల, హరీష్ మారీపల్లి, సురేష్ నాగవరపు, మంజుల గుజ్జు, మాధవి అన్నం, రవి చంద్ర అనంత మనోజ్, చక్రపాల్ కల్వా తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+