భార్యను చంపి కాల్చేసిన గే టెక్కీ

29 ఏల్ల జస్వీర్ రామ్ గిండే ఇంటిలో వాక్యూమ్ లోహం పైపుతో దాడి చేసి తన భార్య వర్ఖా రాణిని హత్యచేశాడు. వారికి భారతదేశంలో ఆరు నెలల క్రితం వివాహమైంది. అతని నేరాన్ని కోర్టు నిర్ధారించింది. గే కావడంతో అతను తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురయ్యాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
మూడు వారాల పాటు జ్యూరీ విచారణ జరిపి ఆ టెక్కీని దోషిగా తేల్చింది. పేద అమాయకమైన అమ్మాయిని జస్వీర్ పెళ్లి చేసుకున్నాడని, అతను అబద్ధంలో బతుకున్నాడని సీనియర్ దర్యాప్తు అధికారి డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ సరబ్జిత్ జోహాల్ ఉన్నారు.
గొడవ జరగడంతో తన భార్య తన వస్తువులను తీసుకుని బయటకు వెళ్లిపోయిందని గిండే తొలుత చెప్పాడు. ప్రమాదవశాత్తు మాత్రమే తాను ఆమెను చంపానని తర్వాత చెప్పుకున్నాడు. పథకం ప్రకారమే అతను భార్యను చంపాడని జ్యూరీ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications