వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధూమ్ ధామ్: కెనడాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

ఈ వేడుకలో ముక్యంగా కల్చరల్ సెక్రటరీ శ్రీ వియాజకుమార్ తిరుమలాపురం వారు చక్కగా రూపొందించిన స్పెషల్ ప్రోగ్రాం పోతరాజు గా “గిరిధర్ గొఱివిడి”, పీరీ సాహేబులు గా దామోదర్ రెడ్డి మరియు శ్రీనివాస్ చంద్ర.

|
Google Oneindia TeluguNews

కెనడా లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ "ధూమ్ ధామ్" మూడోవ వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో (Telangana Canada Association TCA) తేదీ 3 జూన్ 2017 శనివారం రోజున మిస్సిస్సి నగరం లోని పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్ ఆడిటోరియం లో తెలంగాణ స్టేట్ ఫార్మషన్ డే "ధూమ్ ధామ్" మూడోవ వార్షిక ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరుపుకున్నారు.

 Telangana Formation Day: NRIs Celebrating Statehood Day Celebrations in Canada

మొదటగా కార్యదర్శి శ్రీమతి రాధికా బెజ్జంకి గారు అందరికి ఆహ్వానం పలుకగా, అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి గారు సభను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభలోఉన్నవారి తో మౌనం పాటింపచేసినతరువాత సభను ప్రారంభించారు.

"ధూమ్ ధామ్" ఉత్సవాలకు భారతీయ ఉప కన్సుల్టే జనరల్ శ్రీ సైఫ్ ఉల్లాహ ఖాన్ గారు ముఖ్య అతిధి గ విచ్చేసి, స్టేట్ ఫార్మషన సందేశాన్నిమరియు అభినందనలు తెలంగాణులకు తెలియచేసారు.ఇందులో భాగంగా TCA వారు ఎన్నో వినూత్నమైన సాంసృతిక కార్యక్రమాలు రూపొందిచారు. ఈ సంబరాల్లో దాదాపుగ 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని వియజయవంతం చేసారు.

 Telangana Formation Day: NRIs Celebrating Statehood Day Celebrations in Canada

ఈ వేడుకలో ముక్యంగా కల్చరల్ సెక్రటరీ శ్రీ వియాజకుమార్ తిరుమలాపురం వారు చక్కగా రూపొందించిన స్పెషల్ ప్రోగ్రాం పోతరాజు గా "గిరిధర్ గొఱివిడి", పీరీ సాహేబులు గా దామోదర్ రెడ్డి మరియు శ్రీనివాస్ చంద్ర ", రైతు మరియు పటేల్ గా సమ్మయ్య వాసం , మూర్తి కలిగొని మరియు ఆడవారు, పిల్లలు బతుకమ్మ, బోనాలు ఆడుతూ గ్రామా వాతావరణము ఒక పండుగ లా టొరంటో నగరం లో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమములో విభిన్నమైన సాంకృత్తిక నృత్య ప్రదర్శనలు " జానపద , బోనాల, పంజాబీ భాంగ్రా, అస్సామీ నృత్యాల తో పాటు దక్షిణ భారతీయ నుర్థ్యాలు, టాలీవుడ్ మరియు బాలీవుడ్ డాన్స్ లు ప్రదర్శించిన తీరు దాదాపు 6 గంటలపాటు సభికులందరిని అలరించాయి.

 Telangana Formation Day: NRIs Celebrating Statehood Day Celebrations in Canada

ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు ప్రదర్శించటం విశేషం. సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమములో TCA వవస్థాపకుడు శ్రీ మునుకుంట్ల రమేష్ గారు జాగృతి కెనడా చాప్టర్ అధ్యక్షులు గా ఎన్నికయినా సంద్భముగా మరియు అయన కెనడా లో తెలంగాణ కమ్యూనిటీ ఖి చేసినా సేవలను గుర్తిస్తూ ఆయన సతీమణి మునుకుంట్ల ధన లక్ష్మిగారి సమక్షం లో TCA గవర్నింగ్ బోర్డు కమిటీ శాలువాలతో మరియు పుష్ప గుచ్ఛములతో సత్కరించారు. తదుపరి మొమెంటో ను బహుకరించారు.

ఈ కార్యక్రమము లో జాగృతి US చాప్టర్ అధ్యక్షులు శ్రీ శ్రీధర్ బండారు గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ గౌరవ మర్యాదలతో శాలువా మరియు మెమెంటో తో సత్కరించారు
"ధూమ్ ధామ్-2017" ఉత్సవాలను ఉద్హేసించి తెలంగాణ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు TCA కు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.

అలాగే తెలంగాణ డాక్టర్స్ సంగం TGGDA అధ్యక్షులు డాక్టర్ శ్రీ పల్లం ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ శ్రీ రమేష్ సిద్దెపేట అధ్యక్షులు TGGDA - గాంధీ యూనిట్ వారు అభినందనలు వీడియో ద్వారా తెలియచేసారు మరియు డాక్టర్ ప్రవీణ్ గారు ఇటీవల కెనడా పర్యటనలో TCA మిత్రులకు వారి కుటుంబ సబ్యులకు హైదరాబాద్ లో ఎలాంటి మెడికల్ సంబంధమైన అవసరం వచ్చినా, వారు మరియు వారి డాక్టర్స్భ బృందం అండగా ఉంటారని మీడియా పరంగా తెలియచేసారు.

 Telangana Formation Day: NRIs Celebrating Statehood Day Celebrations in Canada

ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిట అధ్యక్షులు శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగగా, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, సెక్రటరీ శ్రీమతి రాధిక బెజ్జంకి , సాంస్కృతిక కార్యదర్శి శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, కోశాధికారి శ్రీ సంతోష్ గజవాడ , డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ మురళి కాందివనం, శ్రీ దామొదర్ రెడ్డి మాది, శ్రీ మల్లిఖార్జున్ మాదపు, శ్రీమతి భారతి కైరోసు మరియు బోర్డు అఫ్ ట్రస్టీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, ట్తస్టీ సభ్యులు శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ శ్రీనివాస్ తిరునగరి ల తోపాటు, వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, సభ్యలు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ హరి రాహుల్, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ నవీన్ సూదిరెడ్డి , శ్రీ వేణు రోకండ్ల మరియు వాలంటీర్ల సహాయంతో నిర్వహిచారు.

ఈ కార్యకర్మమును శ్రీమతి స్నిగ్ధ గుళ్ళపల్లి, కుమారి మానస్వి బెజ్జంకి, కుమారి ఐశ్వర్య శివాని ఈద మరియు కుమారి మేధాస్వర్గం ఎంతో ఉత్సహవంతముగా సమన్వయము గావించారు. ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

English summary
Telangana Formation Day was grandly celebrated by NRI’s in Canada. Celebrations held at port secondary school
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X