రాజు ఎక్కడున్నా రాజేరా.. ఇండియాలో నెం.1 హీరోగా ప్రభాస్
ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగం అంటే కేవలం 'బాలీవుడ్' అనే ముద్ర బలంగా ఉండేది. ఉత్తరాది తారల హవానే దేశవ్యాప్తంగా నడిచేది. కానీ, కాలం మారింది.. కథ మారింది! ప్రాంతీయ భాషల సరిహద్దులను బద్దలు కొడుతూ, బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ తన అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ సైతం తెలుగు స్టార్ల క్రేజ్, ఇక్కడి సినిమాల రేంజ్ చూసి తట్టుకోలేకపోతున్నారు. ప్రముఖ మీడియా కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్ సంస్థ ఓర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన 'ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్' (ఏప్రిల్ 2026) నివేదిక ఈ విషయాన్ని మరోసారి ఘనంగా చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ రిపోర్ట్ నేషనల్ వైడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద సంచలనంగా మారింది.
వీడు ఎక్కడున్నా రాజేరా
'బాహుబలి' సినిమాలో అమరేంద్ర బాహుబలిని ఉద్దేశించి వచ్చే ఈ పవర్ ఫుల్ డైలాగ్ వెండితెరకు మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ రెబల్ స్టార్ ప్రభాస్ కు అక్షరాలా సరిపోతుంది. ఈ తాజా జాతీయ సర్వేలో ప్రభాస్ తన తిరుగేలేని పాపులారిటీని నిరూపించుకుంటూ దేశంలోనే నంబర్ వన్ మోస్ట్ పాపులర్ స్టార్ గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం ఈ ఒక్క నెలలోనే కాదు.. గత నాలుగేళ్లుగా జాతీయ స్థాయిలో ఆయనే నంబర్ వన్‌గా కొనసాగుతుండటం విశేషం. 'బాహుబలి'తో మొదలైన ప్రభాస్ మేనియా.. రీసెంట్‌గా 'కల్కి 2898 AD', 'సలార్' చిత్రాలతో మరింత ఉన్నత స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఆయన 'స్పిరిట్', 'ఫౌజి', సలార్ 2, కల్కి2 చిత్రాలు బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేయబోతున్నాయో ఈ క్రేజ్ చూస్తేనే అర్థమవుతోంది.

టాప్ 10 లో సగం మనవాళ్లే
ఈ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 మేల్ సినీ స్టార్స్ జాబితాలో టాలీవుడ్ హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మొత్తం పది స్థానాలలో ఏకంగా ఐదు స్థానాలను తెలుగు హీరోలే కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తాను చాటారు.
నంబర్ 1 - ప్రభాస్: తిరుగులేని పాన్-ఇండియా కింగ్.
నంబర్ 2 - షారుక్ ఖాన్
నంబర్ 3 - అల్లు అర్జున్
నంబర్ 4 - దళపతి విజయ్
నంబర్ 5 - మహేష్ బాబు
నంబర్ 6 - రణవీర్ సింగ్
నంబర్ 7 - రామ్ చరణ్
నంబర్ 8 - సల్మాన్ ఖాన్
నంబర్ 9 - అక్షయ్ కుమార్
నంబర్ 10 - జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లను దాటుకుని తెలుగు హీరోలు నేషనల్ వైడ్‌గా టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. ప్రభాస్ అగ్రపీఠం మొదలుకొని, మన స్టార్ల టాప్-10 హవా చూస్తుంటే.. ఇండియన్ సినిమాకు ఇప్పుడు టాలీవుడ్ పెద్దదిక్కుగా మారింది.












Click it and Unblock the Notifications