2 కోట్ల ఫాలోవర్లు.. దేశంలోని పెద్ద పార్టీలకి మైండ్ బ్లాక్
దేశంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, ఆప్ వంటి దిగ్గజాలకు సోషల్ మీడియా వేదికగా ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాల చరిత్ర, కోట్ల రూపాయల ఫండింగ్, పక్కా ఐటీ సెల్స్ ఉన్న ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కాని రీతిలో.. కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీ దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ఫాలోవర్ల రికార్డులను గాల్లో కిందా మీదా చేసి పడేసింది. కొందరు యువ విమర్శకులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) చేసిన 'కాక్రోచ్' (బొద్దింక) వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కేవలం నిరసనగా, కాస్త వ్యంగ్యంగా (Satire) ప్రారంభమైన ఈ డిజిటల్ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న యువత నుండి బ్రహ్మరథం లభిస్తోంది. కేవలం కొద్దిరోజుల్లోనే ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 20.2 మిలియన్ల (2 కోట్లకు పైగా) ఫాలోవర్ల మైలురాయిని దాటేసింది. దేశంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న అధికార బీజేపీ (ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్లు), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (13.4 మిలియన్లు) వంటి పెద్ద పార్టీల అధికారిక పేజీలను ఈ కాక్రోచ్ పార్టీ అత్యంత సునాయాసంగా వెనక్కి నెట్టేసింది.

"నేనే సీఎం.. నేనే ఎమ్మెల్యే".. నెట్టింట అభ్యర్థుల హడావుడి!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యువత ఈ ట్రెండ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. తామే ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' తరపున కాబోయే సీఎం, ఎంబీబీఎస్ చదివిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులమంటూ కుర్రాళ్లు సెల్ఫ్ డిక్లరేషన్ వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. వినూత్నమైన మేనిఫెస్టోలు, బొద్దింక గుర్తుతో ఉన్న ఫ్లెక్సీల ఎడిటింగ్స్, పొలిటికల్ రీల్స్ మరియు మీమ్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం నిండిపోయింది. కేవలం సరదా కోణంలోనే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడానికి యువత ఈ సరికొత్త డిజిటల్ పంథాను ఎంచుకోవడం విశేషం.
పోటీగా దూసుకొచ్చిన 'HIT జనతా పార్టీ'!
రాజకీయాల్లో పోటీ సహజం కదా! అందుకే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దూకుడుకు బ్రేకులు వేయడానికి.. బొద్దింకల నివారణకు వాడే ప్రసిద్ధ బ్రాండ్ 'హిట్' పేరుతో 'HIT జనతా పార్టీ' (HJP) నెట్టింట రంగంలోకి దిగింది. "మీరు కాక్రోచ్స్ అయితే.. మిమ్మల్ని క్లీన్ చేయడానికి మేము హిట్ లాంటి వాళ్లం" అంటూ ఈ కొత్త గ్రూప్ చేస్తున్న పోస్టులు మార్కెట్లో మరికొంత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి కోట్లాది రూపాయల ప్రకటనలు గుప్పిస్తున్న ఈ తరుణంలో.. కేవలం ఒక చిన్న నిరసన వ్యాఖ్య ఆధారంగా పుట్టుకొచ్చిన ఒక వర్చువల్ పార్టీ దేశంలోని అన్ని పొలిటికల్ స్క్రీన్లను బ్లాంక్ చేయడం డిజిటల్ మీడియా పవర్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications