వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమంలా బంగారు తెలంగాణ: ఎన్నారైలకు పిలుపు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: లండన్‌లో తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) ఆద్వర్యంలో 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణా విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి' ఘనంగా నిర్వహించారు, యూకే నలుమూలల నుండి భారీగా తెలంగాణా ఎన్నారై ఫోరం, తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలంగాణా ఎన్నారై ఫోరం సెక్రెటరీ రంగుల సుధాకర్ గౌడ్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, తర్వాత జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) మరియు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.

తెలంగాణా విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణా నిర్మాణ దిశలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు, తను లండన్‌లో గత 4 రోజులుగా హాజరైన అధికారిక కార్యక్రమాల గురించి వివరించారు, తెలంగాణా రాష్ట్రాన్ని ఎలాంటి ఉద్యమాలతో సాధించుకున్నామో అలాగే అబివృద్ది కూడా ఒక ఉద్యమం లా చేసుకోవాలని కోరారు.

హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా ఉన్నంత వరకు మనం అప్రమత్తంగా ఉండాలని మల్లి ఎటువంటి పోరాటాలకైన సిద్దంగా ఉండాలని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్ గ్రిడ్ మరియు మిషన్ కాకతీయ పథకాల గురించి వివరించారు. టీఆర్ఎస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు.

తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు

తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు

సిక్క చంద్రశేకర్ గౌడ్ గారు మాట్లాడుతూ, బంగారు తెలంగాణా కొరకు సంస్థ చేపట్టని కార్యక్రమాల గురించి వివరించారు, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకి తెలంగాణా ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.

జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షులు

జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షులు

విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆద్యాత్మిక సంస్థను నడిపిస్తునప్పటికి తెలంగాణా డిమాండ్ అనేది న్యాయబద్దమైనదని ఎప్పటికప్పుడు తెలంగాణా సంస్థలకు, టీఆర్ఎస్ పార్టీకి తను అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణా పది జిల్లాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడ్తునట్టు తెలిపారు.

ప్రదాన కార్యదర్శి

ప్రదాన కార్యదర్శి

ప్రదాన కార్యదర్శి సుమన్ బలమూరి మాట్లాడుతూ, తెలంగాణా ప్రభుత్వ పాటశాలలని దత్తత తీసుకొని వాటి ద్వార్య పేద విద్యార్థులకు సరైన విద్య అందేలా చూస్తామని దానికి ఎన్నారైల అందరి సహకారం కావాలని కోరారు.

కార్యక్రమంలో

కార్యక్రమంలో

కార్యక్రమంలో తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్, ఎన్నారై టీఆర్‌ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి, ప్రదాన కార్యదర్శి సుమన్ బలమూరి, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్
రెడ్డి, గోలి తిరుపతి, ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్ అంతటి, సెక్రెటరీ రంగుల సుధాకర్ గౌడ్ లతో పాటు ముఖ్య నాయకులు విక్రం రెడ్డి, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సేరు సంజయ్, శ్రీకాంత జెల్ల, సుమ దేవి, నరేష్, రంగు వెంకట్, శివాజీ షిండే, మల్లా రెడ్డి, స్వాతి, సురేష్, వాణి, రాజేష్ వర్మ, వినయ్, గోపి, గణేష్ పాల్గొన్న వారిలో ఉన్నారు.

మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. విద్యా రంగం లో తెలంగాణా ప్రబుత్వం చేపడుతున్నKG to PG, మరియు ఇతర కార్యక్రమాలని సభకు వివరించారు. ఎడ్యుకేషన్ కమిషనర్ చిరంజీవులు గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధనలో లండన్‌లోని ఎన్నారైల పాత్ర గొప్పదని విద్య రంగానికి సంబంధించి ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు.

ఎన్నారై టీఆర్ఎస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు మంత్రి జగదీష్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

English summary
Telangana NRI Forum meet and greet with telangana minister for education Jagadish Reddy in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X