వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేంజ్ లీడర్లతో ముచ్చట: హైదరాబాద్‌లో తెలంగాణ ఎన్నారై సమావేశం

అమెరికాలో నివసిస్తూ మాతృ భూమి కోసం సేవ చేస్తున్న అనేక మంది ప్రవాస తెలంగాణ వాదులు తమ తమ అనుభవాల్ని పంచుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ లోని న్యూయార్క్ టవెర్న్ హోటల్లో వివిద దేశాలనుండం వచ్చిన సుమారు 100 మంది ప్రవాస తెలంగాణ వాదులు సుమారు 8 గంటలు సమవేశం అయ్యారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేకుండ అభివృద్ది చేస్తూ ఒక మార్పు తీసుకువచ్చిన కొంతమంది చేంజ్ లీడర్ల తో మాట ముచ్చట.

ఈ సమావేశానికి ముఖ్య అథిదులుగా రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీ ఆయచితం శ్రీధర్ గారు, టి.శాట్ టి.వి శ్రీ శైలెష్ రెడ్డి గారు హాజరు అయ్యారు. అమెరికా లో నివసిస్తు మాత్రు భూమి కోసం సేవ చేస్తున్న అనెక మంది ప్రవాస తెలంగాణ వాదులు తమ తమ అనుభవాల్ని పంచుకున్నారు.

telangana nri's meeting with change leaders

శ్రీ శైలెష్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 2001 లో స్తాపించబడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఆధినం లోని సాఫ్ట్ నెట్ టి.వి సమైక్య పాలనలో ఎంత నిర్లక్ష్యం చేయబడింది. దానిని తను సి.ఈ.ఓ గా చేరిన తరవాత ఎలా ముందుకు తీసుకెల్తుంది సవివరంగా చెప్తునే ప్రవాస తెలంగాణ వాదులు అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశాల్లోని విద్యా విదానం కు సంబందించిన కాంటెంట్ ఉంటే పంపించాలని కోరారు.

సగానికి పైగ మూతబడ్డ ప్రభుత్వ పాఠశాల్లోని టి.వి ప్రసారలకు సంబందించి చొరవ తీసుకొని వీలైన సహయం చేస్తె తెలంగాణ ప్రాంత విద్యార్దులకు మంచి విద్య తో పాటూ ఉద్యోగస్తులకు అవసరమైన సమాచారం టి.సాట్ మరియు టి.ఆకాడమి చేరవెస్తుంది అని చెప్పారు.

telangana nri's meeting with change leaders

శ్రీ ఆయచితం శ్రీధర్ గారు మాట్లాడుతు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కు సంబందించి లైబ్రరిలు పోటి పరిక్షలకు చాల ఉపయొగ పడ్డ విధానం చెప్పారు. విదేశాల్లోని అత్యాదునిక టెక్నాలొజి ఉపయోగించి ప్రవాసులు ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లోని లైబ్రరిలు బలోపెతం చేయాల్సిందిగా కోరారు.

పూర్వ కాలంతో పోలిస్తే గ్రంధాలయాల ఉపయోగం మరింత పెరిగితేనే యువతలో మార్పు వస్తుంది. తద్వారా సమాజంలో మంచితనం పెరుగుతుంది. అదేవిదంగా అమెరికా లాంటి దేశాల్లోని ప్రవాసులు నెలలో ఒకరోజు తమ తమ ప్రాంతాల్లోని గ్రందాలయల నిర్వహకులతో, సందర్షకులతో మాట్లడుతు అక్కడి అవసరాలు ఏమైనా ఉంటే చూడాలని కోరారు.

వుమెన్ ఎంపవర్‌‌మెంట్ మీద వంశి మాచినేని, టీ విత్ హెడ్మాస్టర్ కార్యక్రమం గురించి జలగం సుధీర్, సేవ్ జనగాం మీద మంగలం పెల్లి రాజు, తోపుడూ బండి నిర్వహణ మీద సాదిక్ ఆలి, జీరో ఎలెక్షన్ బడ్జెట్ మీద పి.మాధవ రెడ్డి, వ్యవసాయ విధానం మీద మెండు శ్రీనివాసులు,

సేవ్ రైన్ వాటర్ మీద సుభాష్ రెడ్డి, గిఫ్ట్ అ ఫ్లాగ్ మీద సుర్యాలెఖ, హరిత హారం మీద వన జీవి సురెష్ గుప్తా, గ్రామాల అభివ్రుద్ది మీద సర్పంచ్ యాకుబ్ రెడ్డి, తెలంగాణ సినిమా రంగం అభివృద్ది మీద నటుడు, నిర్మాత రఫి, బయో డైవర్సిటి మీద నరెందర్ ముప్పారపు, డేటా అవసరాల మీద రాకెష్ దుబ్బుడు, జర్నలిజం మీద రజనికాత్ ఎర్రబెల్లి (socialpost.news)

telangana nri's meeting with change leaders

మేకిన్ తెలంగాణ అంశం మీద స్పందన ఆయచితం(UK), సేవ భారతి మీద రఘు వెరబెల్లి, మోడల్ విలేజ్ మీద బాల్ రాజ్ గౌడ్, తెలంగాణ అభివ్రుద్ది మీద లక్ష్మన్ అనుగు తదితరులు తమ తమ ప్రజంటేషన్స్ చేసారు.

ఇంతమంది ప్రవాస భారతీయుల్ని ఒక దగ్గర చేర్చిన నిర్వహకులు రవి మేరెడ్డి, జలగం సుధీర్, శాంతి పుట్టా, భరత్ యడ్మ లను గ్రంధలయ సంస్థ చైర్మన్ వారి సంస్థ తరపున మొమెంటొ లన ఇచ్చి అభినందించారు.

ఈ కార్యక్రమానికి డి.పి.రెడ్డి, నళనిధర్ రెడ్డి, శ్రీనివాస్ రనబోతు, మహేష్ తన్నిరు, ఉపెందర్ రెడ్డి గాదే, రవిందర్ గడ్డంపల్లి, గాల్ రెడ్డి,సురెశ్ గుడిపురి, హరి కాసుల, క్రిషి సంస్థ ప్రతినిది ప్రదీప్ మంద, వెంకట్ రెడ్డి, శ్రినివస్ మామిడి తదితరులు హాజరయి తమ తమ అభిప్రాయాలు పంచుకున్నరు.

English summary
Telangana NRI's conducted a meeting in Hyderabad to discuss the future development plans of state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X