లండన్‌లో చేనేత వస్త్ర నిలయం: తెలంగాణ ఎన్నారై మహిళా విభాగం కృషి

Subscribe to Oneindia Telugu

లండన్ : చేనేత పరిశ్రమ అబివృద్దికి తమ వంతు కృషి చేద్దాం,బాధ్యత వహిద్దాం అనే నినాదంతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ మహిళలు ముందుకొచ్చారు. సిరిసిల్ల నుండి ప్రత్యేకంగా తెప్పించిన వస్త్రాలను ధరించి లండన్ బ్రిడ్జి వద్ద ప్రదర్శించి.. 'వి సపోర్ట్ తెలంగాణ వీవర్స్'అనే నినాదం తో మద్దతు తెలిపారు .

ఎన్నారై శాఖా మంత్రి వర్యులు కేటీఆర్ వారానికి ఒక రోజు చేనేత దరిస్తా అన్న ప్రకటనను స్ఫూర్తిగా తీసుకుని మేము సైతం అంటున్నారు లండన్ మహిళా. త్వరలో సిరిసిల్ల హ్యాండ్లూమ్ ,ప్రభుత్వ సహకారం తో వచ్చే నెలలో చేనేత చీరలు మరియు షర్ట్స్ , గృహావసరాల నిమిత్త బట్టలు మొదలైనవి తెలంగాణ నుండి తెప్పించి లండన్ లో ఒక వస్త్ర నిలయం ఏర్పాటు చేసి మార్కెటింగ్ కి కృషి చేస్తామని ప్రతినిధులు కాసర్ల జ్యోతి రెడ్డి , శ్రీలక్ష్మి ,అంతటి మీనాక్షి తెలిపారు .

యూరోప్ లో కాటన్ వస్త్రాల ఉపయోగం ఎక్కువ గ ఉంటుంది. కొంత సమయం తీసుకొని మొదట ఇక్కడి ప్రవాస భారతీయులకు పరిచయం చేస్తామని మార్కెటింగ్ సన్నాహాలు చేస్తామని గోలి కవిత తెలిపారు. ఇతర తెలంగాణ /తెలుగు సంఘాల మహిళల సహాయం తీసుకొని రాబోయే బోనాలు,బతుకమ్మ సంబరాల్లో చేనేతకు పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చే ప్రయత్నం తెస్తామని సిక్కా ప్రీతీ తెలిపారు .

Telangana NRI women support to siricilla weavers

సిరిసిల్ల నుండి ప్రత్యేకంగా తెప్పించిన చేనేత వస్త్రాలను లండన్ చారిత్రిక ప్రదేశాల్లో ధరించి ఫోటో ,వీడియో షూట్ నిర్వహించి సోషల్ మీడియా ద్వారా ప్రవాస భారతీయులను కదిలించే దిశగా మా ప్రయత్నం మొదలు పెట్టామని అనసూరి వాణి తెలిపారు.

ఈ కార్యక్రమం లో రంగుల శౌరి,గంప జయశ్రీ ,హేమలత గంగసాని, పాల్గొన్నారు . ప్రవాస తెలంగాణ మహిళ లు చేనేతకు మద్దతు ఇవ్వడంపై చేనేత బంధు ,పద్మ శ్రీ శ్రీ చింతకింది మల్లేశం గారు ప్రశంసించారు .వీడియో ద్వారా తన సందేశాన్ని అందచేస్తూ తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the inspiration of Telangana minister KTR, Telangana NRI Women are take a step to support telangana weavers
Please Wait while comments are loading...