తెలంగాణ విజయోత్సవ సభ(పిక్చర్స్)
లండన్: ఇంగ్లండ్ దేశంలోని లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (టిఈఎన్ఎఫ్), ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యూనైటెడ్ కింగ్డమ్ నలుమూలల నుంచి దాదాపు 400 మందికి పైగా తెలంగాణవాదులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు లండన్ వీధుల్లో తెలంగాణవాదులు కారు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి.
విజయోత్సవ సభలో ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన బిడ్డలని, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించి తర్వాత వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు, తెలంగాణ జెఏసి ఛైర్మన్ ఫ్రొ. కోదండరాం చేసిన కృషిని, పోరాటాన్ని ఈ సందర్భంగా వారు అభినందించారు. అదే స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని వారు కోరారు.
టిఈఎన్ఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సహకరించిన ఎన్నారైలకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి సంస్థ చేపట్టే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా 60 అడుగులు తెలంగాణ జెండాను రాష్ట్ర సాధనకు చిహ్నంగా ఆవిష్కరించారు.
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు, టిఈఎన్ఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమంలో అవకాశం కల్పించినందుకు కెసిఆర్, కోదండరాంలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్థలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. తెలంగాణ సమాజానికి తమవంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ సాధనకు సహకరించిన అన్ని పార్టీలకు వారు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో టిఈఎన్ఎఫ్ మహిళా కో-ఆర్డినేటర్ పవిత్ర రెడ్డి, ఈవెంట్ కో-ఆర్డినేటర్ ఉదయ్ నాగరాజు, చందూగౌడ్, ప్రమోద్, అశోక్, మల్లారెడ్డి, సుమ, హరి, విష్ణురెడ్డి, నవీన్ రెడ్డి, సుమన్ బల్మూరి, సునీల్, మనెల, రోహిత్, విక్రమ్, చారి, జిత్తు, ప్రవీణ్, మీనా, శ్రీను, వెంకట్, సుహాసిని, మల్లేష్, మహేష్, ప్రసాద్, శ్రీధర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

కారు ర్యాలీ
ఇంగ్లండ్ దేశంలోని లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (టిఈఎన్ఎఫ్), ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముందు లండన్ వీధుల్లో తెలంగాణవాదులు కారు ర్యాలీ నిర్వహించారు.

విజయోత్సవ సభలో కోలాటం
ఇంగ్లండ్ దేశంలోని లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (టిఈఎన్ఎఫ్), ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

సమావేశంలో నేతలు
టిఈఎన్ఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సహకరించిన ఎన్నారైలకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి సంస్థ చేపట్టే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

విజయోత్సవ సభ
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు, టిఈఎన్ఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమంలో అవకాశం కల్పించినందుకు కెసిఆర్, కోదండరాంలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధనకు సహకరించిన అన్ని పార్టీలకు వారు కృతజ్ఞతలు చెప్పారు.












Click it and Unblock the Notifications