లండన్‌లో "తాల్" సంక్రాంతి.. అలరించిన వేడుకలు
లండన్ : విదేశీగడ్డపై తెలుగు సౌరభం వెల్లివిరిసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 19న వెస్ట్ లండన్ లో జరిగిన ఈ వేడుకల్లో ఐదు వందలకు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువు.. ఇలా ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా సంక్రాంతి పండుగను సంబరంగా నిర్వహించారు.

లండన్‌లో సంక్రాంతి సంబరం
సంక్రాంతి పురస్కరించుకుని లండన్ లో నిర్వహించిన పండుగ సెలబ్రేషన్స్ ఔరా అనిపించాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా ఆడిపాడారు. మహిళల కోసం నిర్వహించిన ముగ్గులు, వంట ల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. చిన్నారులను ప్రోత్సహించడానికి గాలి పటాల తయారీ పోటీ నిర్వహించారు. తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులు కారుణ్య, ప్రియ, సాన్విత, గిరిబాబు ధవళ పాడిన పాటలు, యష్వి కథక్ నృత్యం ఎంతగానో అలరించాయి.

భావితరాలకు సంస్కృతి, సంప్రదాయం
తెలుగు భాషను, సంస్కృతిని భావితరాలకు అందించే ప్రయత్నంగా తాల్ నిర్వహిస్తున్న సాంస్కృతిక కేంద్రంలో తమ పిల్లలను చేర్పించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు సంస్థ ఇంఛార్జీలు రాజేశ్ తోలేటి, గిరిధర్ పుట్లూరు ధన్యవాదాలు తెలిపారు. లండన్, బ్రిటన్ లో నివసిస్తున్నతెలుగువారు తమ పిల్లలను
తాల్ సాంస్కృతిక కేంద్రంలో చేర్పించి తెలుగు భాషను, సంస్కృతిని వారికి వారసత్వంగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా తాల్ సాంస్కృతిక కేంద్రం నిర్వహణకు సహకరిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు.

అందరికీ ధన్యవాదాలు
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తాల్ ఛైర్మన్ శ్రీధర్ మేడిశెట్టితో పాటు కార్యవర్గ సభ్యులు భారతి కందుకూరి, నిర్మల ధవళ, రాజేష్ తోలేటి, శ్రీధర్ సోమిసెట్టి, మల్లేష్ కోట, శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ పుట్లూరు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్స్ యదాటి శర్మ, శర్మిల రెడ్డి, వైదేహి తాతపూడి, అనిత నోముల, లోకమాన్య కోట, సూర్య కందుకూరి, గిరిబాబు ధవళ, సంగీత సోమిశెట్టి, రాజా వశిష్ఠ, నవీన్ గడంసేథి, కిషోర్ కస్తూరి, హరిణి, విశాలాక్షిని ప్రశంసించారు.

విజేతలు వీరే..!
వంటల పోటీ విజేతలు
1. నీలిమ - 1st Prize
2. సత్య శ్రీదేవి - 2nd Prize
3. సమంత - 3rd Prize
4. పల్లవి నండూరు (consolation)

ముగ్గుల పోటీ విజేతలు
1. శశిరేఖ - 1st PRize
2. స్వాతి - 2nd Prize
3. ఉష - 3rd Prize
4. జయంతి (consolation)

గాలి పటాల తయారీ పోటీలో పాల్గొన్న చిన్నారులు
• చతుర్వేద్ కస్తూరి
• విశ్వజ
• ఐషు
• వరప్రసాద్ సోమిసెట్టి
• వేద్ మేడిశెట్టి
• అవిజిత్
• గౌతమ్
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!