NRI News: అమెరికాలో చంద్రబాబు కోసం రోడ్డెక్కిన తెలుగు ప్రజలు..
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతోన్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటు బెంగళూరు లో కూడా ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. అటు విదేశాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తు నిరసనలు తెలుపుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలో చంద్రబాబు అరెస్ట్ వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమెరికాలో పెద్దఎత్తున తెలుగు ప్రజలు రోడ్డెక్కారు. న్యూజెర్సీలో చంద్రబాబు కు మద్దత్తుగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలో పాల్గొన్నారు.
తెలుగుదేశం,జనసేన జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు తీసుకొచ్చిన విద్యా ప్రమాణాలు వల్లే తాము విదేశాల్లో స్థిరపడ్డామన్న ప్రవాసాంధ్రులు చెబుతున్నారు. న్యాయం కావాలి - చంద్రబాబు విడుదల కావాలనే నినాదాలతో అమెరికా రోడ్లపై ర్యాలీ తీశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమoటూ అమెరికా వీధుల్లో నినాదించారు. సైకో పోవాలి- సైకిల్ రావాలి అనే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కోరారు.

చంద్రబాబు ఏసీబీ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ విచారణ 19వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అటు హైకోర్టులో కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టులో సీఐడీ తరఫున వాదనలు విపించిన న్యాయవాదులు చంద్రబాబు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉన్నట్లు కోర్టు గుర్తు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను 19 తేదీకి వాయిదా వేసింది. తండ్రి కోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు.
మరోపక్క నారా లోకేష్ ఒకపక్క లాయర్లతో మాట్లాడుతూ మరోవైపు జాతీయస్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతోందో వివరిస్తున్నారు. లోకేష్ ఢిల్లీలో రఘురామకృష్ణరాజును కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో రఘురామ ఎక్స్ లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications