అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.సందీప్ వర్మ స్వస్థలం విజయనగరం జిల్లా. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం కుమారుడు సందీప్ వర్మ. బంధువులు, ప్రభుత్వం అధికారులు సహాయంతో సందీప్ వర్మ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
అమెరికాలో రెండు రోజులు సెలవు దినాలు కావడం వల్ల మంగళవారం రాత్రికి మృతదేహం భారతదేశానికి పంపే అవకాశం ఉంది. సందీప్ మరణవార్త విన్న అతడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సందీప్ బంధువులు అమెరికాలో ఉన్నారు.
రేపు, ఎల్లుండి సెలవులు కావడంతో పోస్టుమార్టం కావడం, తదితర లాంఛనాలు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. 27 ఏళ్ల సందీప్ ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. మిత్రుల ద్వారా సందీప్ మరణవార్త విజయనగరం జిల్లాలోని కుటుంబ సభ్యులకు అందింది.












Click it and Unblock the Notifications