NRI News: అమెరికాలో ఆటా బోర్డు సమావేశం.. పాల్గొన్న ప్రవాసాంధ్రులు..

అమెరికాలో తెలుగు సంఘం (ఆటా) 18వ మహాసభలను 2024 న జూన్ 7,8, 9 తేదీల్లో అట్లాంటాలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సెప్టెంబరు 8,9,10 తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం అయింది. 8న శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ సమావేశంలో పాల్గొన్నారు.

ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. 9న శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమైంది. ఆటా అధ్యక్షురాలు మతి మధు బొమ్మినేని సారథ్యంలో ఉపాధ్యక్షులు జయంత్ చల్లా పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల, హనుమంత్ రెడ్డి, కరుణాకర్ మాధవరం, సుధాకర్ పెరికారి, పరమేష్ భీమ్రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ సమావేశంలో పాల్గొన్నారు.

NRI News

ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకలపై చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటీ(ATS) సంస్థ విలీనం , సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక, సేవా అభివృద్ధి సంబంధిత అజెండా , రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలపై సమావేశంలో చర్చించారు.

NRI News

ఆటా 18 వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు సమావేశంలో మాట్లాడారు. ఆటా సభలకు సహకరించాలని కోరారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

NRI News

ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని , కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18 వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(GWCC) ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేశారు. సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్ లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని, అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. ఆటా 18 వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ ఛైర్మన్, పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పిసికె ఆవిష్కరించారు.,

మధు బొమ్మినేని, జయంత్ చల్లా మరియు కిరణ్ పాశం వేణు పిసికె ను సన్మానించారు. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+