NRI News: ఇటలీ నుంచి వచ్చిన కొద్ది గంటలకే భార్యను హత్య చేసిన ఎన్నారై..
అతనో ఎన్నారై.. చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చాడు. ఇంటికి వెళ్లాడు. ఏమైందో తెలియదు కానీ.. భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. నిందితుడు తన భార్య తలను నేలకెసి కొట్టాడని.. తీవ్ర గాయాలైన భార్య అక్కడికక్కడే మృతి చెందిందిని పోలీసులు పేర్కొన్నారు. సుఖ్‌దేవ్ సింగ్ అనే వ్యక్తి ఇటలీకి వెళ్లాడు అక్కడే స్థిరపడ్డాడు. అతని భార్య పేరు హర్‌ప్రీత్ కౌర్.
సుఖ్‌దేవ్ సింగ్ సోమవారం పంజాబ్ లోని తన స్వగ్రామైన సంధూ చాతాకు వచ్చాడు. ఓ విషయంలో భార్య హర్ ప్రీత్ కౌర్ తో సుఖ్‌దేవ్ సింగ్ గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో కోపంతో సుఖ్‌దేవ్ సింగ్ తన భార్య హర్ ప్రీత్ కౌర్ తలను నేలకెసి కొట్టాడు. రెండు మూడు సార్లు నేలకెసి కొట్టడంతో హర్ ప్రీత్ కౌర్ అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతి చెందడంతో సుఖ్‌దేవ్ సింగ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నిందితుడు సుఖ్‌దేవ్ సింగ్ ప్రవాస భారతీయుడని కపుర్తలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వత్సల గుప్తా తెలిపారు. భార్యతో గొడవపడి ఆమెను హత్య చేసినట్లు చెప్పారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడు కావాలనే హత్య చేశాడా లేక క్షణికావేశంలో హత్య చేశాడా అనేది నిందితుడి పట్టుబడిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. నిందిడు తిరిగి విదేశాలకు పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఎయిర్ పోర్టులకు అతని ఫొటో పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications