భార్యాపిల్లల హత్య: యుఎస్‌లో ఆంధ్ర టెక్కీకి జీవితఖైదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వుయ్యూరుకు చెందిన 46 ఏళ్ల సాఫ్ట్‌వలేర్ ఇంజనీర్ నెరుసు లక్ష్మీనివాస రావుకు ముగ్గురిని దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. అతనికి పెరోల్ అవకాశం లేని జీవిత ఖైదును ఓక్లాండ్ కంట్రీ సర్క్యూట్ కోర్టు విధించింది.
ముగ్గురిని హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు ఇంతకు ముందు తెలుగు టెక్కీ నెరుసు లక్ష్మీనివాస రావు (46)ను దోషిగా తేల్చింది. మిచిగాన్‌లోని నోవీలో తన భార్య ఎన్ జయలక్ష్మి, కుమారుడు శివ (12), కూతురు తేజస్వి (14)లను గొంతు కోసి హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో లక్ష్మీనివాస రావును మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీ సర్క్యూట్ కోర్టు దోషిగా తేల్చింది.

2008 అక్టోబర్ 13వ తేదీన భార్యాపిల్లలను హత్య చేసిన తర్వాత అతను ఇండియాకు పారిపోయి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ సిఐడి సహకారంతో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2013లో ఇంటర్నేషనల్ వారంట్ జారీ చేసింది.
విస్తృతమైన గాలింపు చర్యల ఫలితంగా అతు 2013 ఫిబ్రవరి 20వ తేదీన పోలీసులకు చిక్కాడు. భార్యను 59 సార్లు పొడిచినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతను మానసికంగా దుర్బలుడేమీ కాదని వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సమస్యలే హత్యలకు కారణమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications