ఆసుపత్రి నిర్మాణం కోసం సిలికానాంధ్రకు టీవీ9 రవిప్రకాశ్ భారీ విరాళం

అమరావతి: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ నాలుగు కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. కృష్ణా జిల్లా కూచిపూడి, దాని పరిసరాల్లో ఉన్న 70 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఆధునిక వైద్య సేవలు అందించడం ఈ ఆసుపత్రి ఉద్దేశ్యం.

ఇందులో జనరల్ మెడిసిన్‌తో పాటు గైనకాలజీ, కార్డియాలజీ చిన్న పిల్లలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు ఐసీయూలు, అయిదు ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్స్ లేబరేటరీ అందుబాటులోకి రానుంది.

 TV9 CEO Ravi Prakash donates 4 crore to Sanjivani

2017లో ఆయన రవిప్రకాశ్ పౌండేషన్ స్థాపించారు. ఇది భారత్‌తో పాటు ఆఫ్రికా దేశాల్లో విద్య, వైద్య సేవల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. ప్రస్తుతం కూచిపూడి చుట్టుపక్కల ప్రజలకు ఆధునిక వైద్యం అవసరమైతే యాభై కిలో మీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు వెళ్లవలసి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+