వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్‌లో సాహితీ దిగ్గజాలకు వెన్నెల్లో విందు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక నిర్వహించబోయే "నెల నెలా తెలుగు వెన్నెల" సప్తమ వార్షికోత్సవం లొ పాల్గొనేందుకు డల్లాస్ విచ్చేసిన సాహితీ దిగ్గజాల గౌరవార్ధం సంస్థ పుర్వాధ్యక్షుడు తోటకూర ప్రసాద్ శుక్రవారం రాత్రి ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

ఆహ్వానితులలో డల్లాస్ సాహిత్య ప్రియులు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు, తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు ఉన్నారు. నిండు పున్నమి వెన్నెలలో, ఆరుబయట ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంప్రదాయ పంక్తిభోజనం అనంతరం సాహితీ గోష్టి అందరినీ ఆకట్టుకొంది.

తోటకూర ప్రసాద్ స్వాగత వచనాలు పలుకుతూ - భారతదేశం నుంచి విచ్చేసిన సాహితీ మూర్తులను గౌరవించటం తమ కనీస ధర్మమని, వారితో ఇలా సమయం గడిపే సదవకాశం దక్కడం మన అందరి అదృష్టమని అన్నారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

చల్లని మజ్జిగతో స్వాగతం పలికి చక్కని సహపంక్తి భోజనానికి అందరినీ ఆహ్వానించారు. అడ్డుపెట్టిన అరచేయి నిండుగా నెయ్యి వడ్డించిన చల్లని తల్లులు, నలభీములు కాకున్నా ఉత్సాహం గా వడ్డించిన ఘనులు, పోటా పోటీగా చెణుకులు చతుర్ల మధ్య విందు సరదాగా సాగింది.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

ఉప్పుతో సహ నవకాయ పిండివంటలతో, భుక్తాయాసం తీరను తాంబూలంతో వడ్డించారు. బూందీ లడ్డూ తో మొదలైన వడ్డన కార్యక్రమం, కాలిఫ్లవర్ మంచూరియ, పునుగులు - పచ్చడి, వెజిటబుల్ బిరియాని - పెరుగు పచ్చడి, ముద్దపప్పుకు తోడు పులుసు కూర, నవకాయయగూరల కుర్మా, బంగాళా దుంప వేపుడు వడ్డించారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

ఇంకా కాకరగాయ వేపుదు, మామిడికాయ పప్పు, మజ్జిగ పులుసు, పోటా పోటీగా బీరకాయ - దోసకాయ - కేరెట్ - ఆవకాయ పచ్చడులు, అప్పడం, సాంబారుకు ముందు నేనున్నా అంటూ మీగడతో ఉలవచారు ఇలాహోరా హోరీగా సాగిన వడ్డన చివరికి పైనాపిల్ కేసరి తో ఆగుతుండగా, నేనున్నా అంటూ కిళ్ళీ రాకతో ముగిసింది.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

భోజనానంతరం ముఖ్య అతిథులు ఆహ్వానితులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ వెన్నెలకంటి సినిమాలో చమత్కార సన్నివేశాలు, అనువాద చిత్రాల గురించి ప్రస్తావించారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

సినీ రచయితలకు తమ సొంత భావాలను ప్రదర్శిన్చే స్వేచ్చలేదనీ, దర్శక నిర్మాతల కోరిక మేర రాయవలసిందే కనుక మేము సినిమాకి రాసేవి అన్నీ మా ఏకీభవించిన అభిప్రాయాలు కావని వివరించారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

రసరాజు 'ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బ్రతికానో .. ఎన్నెన్ని భావాలను ఏరి తెచ్చి ఉతికానొ ' అని గజల్ మీద తనకు ఉన్న మక్కువను తెలియచేసారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

భార్య మీద రాసిన ఓ పాటను సరదాగ అందరికీ వినిపించి తిట్లడండకం మరునాడు సభకు వచ్చి వినమని చెప్పి నవ్వించి రసరాజు అందరినీ ఆకట్టుకొన్నారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

మీగడ రామలింగ స్వామి హృద్యంగా వెన్నెల మీద తమ మధుర స్వరం లో ఒక పద్యం వినిపించి, భుక్తాయసం తో నిద్రకు సిద్దం అవుతున్నవారిని మేలుకొలిపారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

బలభద్రపాత్రుని రమణి మాట్లాదుతూ, ఇంతమంది సాహితీ మిత్రుల మధ్య, తోటి సాహితీవేత్తలతో విందు పసందుగా ఉంది అన్నారు. టివి సీరియళ్ళలో పాత్రలు ఎందుకు ఆవిధంగానే రాయవలసి వస్తోందో వివరించారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు


జొన్నవిత్తుల వివిధ సాహితీ ప్రక్రియలపై సరసంగా, చమత్కారం గా, గంభీరంగా తనదైన శైలిలో ప్రసంగించి శ్రోతలను ఆకట్టుకున్నారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు



నిండు పున్నమిలో ఆరుబయట పంక్తి భోజనం తినే అవకాశం భారతదేశంలోనే కరువవుతున్న ఈ రోజుల్లో, ఇలాంటి విందు చక్కగా ఏర్పాటుచేసిన తోటకూర ప్రసాద్‌ను కుటుంబ సభులను అభినందించారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు విజయమోహన్ కాకర్ల మాట్లాడుతూ - "28 సంవత్సరాల సంస్థ చరిత్రలో సాహిత్యానికి ఎప్పుడూ పెద్ద పేట వేస్తుందని" శనివారం జరగబోవు సంగీత సాహిత్య నృత్య సమ్మేళనానికి అందరినీ ఆహ్వానించారు.

వెన్నెల్లో విందు

వెన్నెల్లో విందు

ప్రసాద్ తోటకూర తమ కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, వినీలాకాశంలో జాబిల్లి వెన్నెల కురిపించువేళ, చల్లగాలి మల్లెల సువాసనలు మోసుకొస్తున్నవేళ సాహితీ దిగ్గజాలతో సహపంక్తిభోజనం చేశారు.

English summary
Thotakuri Prasad invited literary personalities to his residence to the dinner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X