ఇదీ అసలు నిజం! ఆ చిన్నారిని పెంపుడు తండ్రే చంపేశాడు.. బలవంతంగా పాలు తాగించి..

నిజం నిప్పులాంటిది. దాచిపెట్టాలనుకున్నా దాగదు. మూడేళ్ల చిన్నారి షెరీన్ మృతి కేసులోనూ ఇదే జరిగింది. ప్రవాస భారతీయుడు, ఫాస్టర్‌ వెస్లీ మాథ్యూస్‌ (37) నిజం కక్కేయడంతో ఈ కేసులో మిస్టరీ వీడిపోయింది.

టెక్సాస్: నిజం నిప్పులాంటిది. దాచిపెట్టాలనుకున్నా దాగదు. టెక్సాస్ లోని మూడేళ్ల చిన్నారి షెరీన్ మృతి కేసులోనూ ఇదే జరిగింది. ప్రవాస భారతీయుడు, ఫాస్టర్‌ వెస్లీ మాథ్యూస్‌ (37) నిజం కక్కేయడంతో ఈ కేసులో మిస్టరీ వీడిపోయింది.

మూడేళ్ల చిన్నారి షెరీన్‌ మాథ్యూస్ మృతికి ఆమె పెంపుడు తండ్రే కారణభూతుడయ్యాడు. పాలు తగడం లేదనే కోపంతో అతడు చేసిన పనికి.. పాపం.. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.

Watched Her Choke On Milk, Die, Says Indian 3-Year-Old's Father: US Police

బలవంతంగా పాలు తాగించే క్రమంలో పాలపీక చిన్నారి షెరీన్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో భయపడిన ఆమె పెంపుడు తండ్రి వెస్లీ మాథ్యూస్ గుట్టుచప్పుడు కాకుండా చిన్నారి శవాన్ని మాయం చేయాలనుకున్నాడు.

షెరీన్‌ మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్లి తన ఇంటికి కొంత దూరంలో ఉన్న డ్రైనేజీలో పడేసి ఏం ఎరగనట్టు తిరిగి ఇంటికొచ్చాడు. తెల్లారి పొద్దున్నే పాప కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఓ కట్టుకధ చెప్పి పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడు.

షెరీన్‌ను బిహార్‌లోని ఓ అనాథాశ్రమం నుంచి రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న కేరళకు చెందిన వెస్లీ మాథ్యూస్‌ అమెరికాలోని రిచర్డ్‌సన్‌ పట్టణంలో నివసిస్తున్నాడు. షెరీన్‌ పాలు తాగకపోవడంతో ఇంటి బయట నిల్చోబెట్టానని, కొంత సేపటి తరువాత చూస్తే పాప కనిపించలేదంటూ తొలుత ఈనెల 7న మాథ్యూస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు అనుమానం కలిగింది. 15 రోజుల పాటు గాలించి చివరికి చిన్నారి మృతదేహాన్ని ఆమె ఇంటికి సమీపంలోని డ్రైనేజి టన్నెల్ లో వారు సోమవారమే గుర్తించారు.

చిన్నారి కనిపించకుండా పోయిన రోజున తెల్లవారుజామున వెస్లీ మాథ్యూస్ ఇంటినుంచి ఒక వాహనం బయటికెళ్లి తిరిగి ఓ గంట తరువాత వచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో వారి అనుమానం పెంపుడు తండ్రి అయినా వెస్లీ మాథ్యూస్ పైకి మళ్లింది. ఎట్టకేలకు అతడు నిజం చెప్పేయడంతో మంగళవారం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి పెంపుడు కూతురైన షెరీన్ చావుకి కారణమైన అతడికి జీవిత ఖైదు లేదా 99 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+