ముగిసిన 15వ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్: చివరి రోజు అంశం భారత తొలి ప్రధాని నెహ్రూపై చర్చ

రచయిత త్రిపుర్దమన్ సింగ్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ, ప్రముఖ న్యాయవాది పింకీ ఆనంద్, రచయిత పురుషోత్తం అగర్వాల్, న్యాయవాది, ప్రొఫెసర్ మరియు రాజకీయ ఆర్థికవేత్త ఎవి సింగ్, జాతీయ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వజాహత్ హబీబుల్లాతో పాటు జర్నలిస్టు, రచయిత మరియు కాలమిస్ట్, వీర్ సంఘ్ నెహ్రూ భారతదేశపు గొప్ప ప్రధాని కాదా అనే అంశంపై చర్చించారు.

చర్చ సందర్భంగా అగర్వాల్ నెహ్రూ గురించి మాట్లాడుతూ "భారత తొలి ప్రధాని నెహ్రూ అతి గొప్ప ప్రధాని. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. దేశవిభజన, తలసరి ఆదాయం, బ్రిటీషు వారు దేశాన్ని దోచుకోవడం" వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. నెహ్రూ మరణం తర్వాత భారత పరిస్థితి ఎలా తయారైందో సింగ్ వివరించారు. భారత దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోయిందన్నారు. రెండవ పంచవర్ష ప్రణాళిక మందగమనంలోకి జారుకుందని గుర్తుచేశారు.నెహ్రూ విదేశాంగ విధానం చాలా శక్తివంతమైనదిగా సింగ్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ లాంటి గొప్ప మేధావి కూడా విమర్శలు చేసేందుకు సాహసించలేదని చెప్పుకొచ్చారు.

15th edition of Jaipur Literature Festival concludes with a debate on Nehrus legacy

జాతీయవాద మరియు సామ్రాజ్య వ్యతిరేక పోరాట జ్వాలగా, ప్రజాస్వామ్య సోషలిజం మరియు లౌకికవాదం యొక్క దార్శనికుడు మరియు భారతదేశం యొక్క మొట్టమొదటి మరియు సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా, జవహర్‌లాల్ నెహ్రూను కొనియాడారు.

15th edition of Jaipur Literature Festival concludes with a debate on Nehrus legacy

జైపూర్ లిటరచర్ ఫెస్టివల్ 15వ ఎడిషన్ ముగింపు ముగిశాయి. ఈ ఏడాది ఈ ఉత్సవాల్లో 600 మంది స్పీకర్లు, ఆర్టిస్ట్‌లు, కళాకారులు భారత్ నుంచే కాక ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొన్నారు.

భాష, యుద్ధం, రాజకీయాలు, పర్యావరణం నుండి వాతావరణ మార్పు, లింగ సమస్యలు, వ్యాపారం, సైన్స్ మరియు సాంకేతికత, చరిత్ర, సినిమా, కళ మరియు ప్రయాణం వంటి చర్చల నుండి, విభిన్న అంశాలపై ఆరోగ్యవంతమైన చర్చలు జరిగాయి.

15th edition of Jaipur Literature Festival concludes with a debate on Nehrus legacy

ఈ సంవత్సరం, ఫెస్టివల్‌కు 'ప్రొటెక్టెడ్ బై డెటాల్ మరియు రాజస్థాన్ టూరిజం, LIC, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ - రాజస్థాన్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ సంవత్సరం వేదిక భాగస్వాములు బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు జాన్ మిచల్స్కీ ఫౌండేషన్. ఎట్సీ, భారతదేశంలోని ఇటలీ ఎంబసీ & ఇస్టిటుటో ఇటాలియన్ డి కల్చర్, బ్రిటిష్ కౌన్సిల్, ఐర్లాండ్ రాయబార కార్యాలయం, ఐక్యరాజ్యసమితి, ఎస్కార్ట్స్ గ్రూప్ మరియు ఆస్ట్రేలియన్ హైకమిషన్ సెషన్ భాగస్వాములుగా ఉత్సవంలో చేతులు కలిపాయి.

సాహిత్యం కోసం జేసీబీ ప్రైజ్, హవ్తోర్డెన్ లిటరరీ రిట్రీట్, హీరో ఫ్యూచర్ ఇంజనీరింగ్ మరియు భారతదేశంలోని అమెరికా ఎంబసీ మరియు కాన్సులేట్‌లు సిరీస్ భాగస్వాములుగా ఫెస్టివల్‌కు అండగా నిలిచాయి. అమెజాన్ ఇండియా ఈ సంవత్సరం ఆన్‌లైన్ సేల్స్ పార్టనర్‌గా ఉంటుంది. మీడియా భాగస్వాములు అమర్ ఉజాలా, బిజినెస్ స్టాండర్డ్, ది వీక్, సకల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, దైనిక్ భాస్కర్, రాజస్థాన్ పత్రిక మరియు ఏబీపీ. వన్ ఇండియా డిజిటల్ మీడియా భాగస్వామిగా మరియు డైలీ హంట్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ భాగస్వామిగా ఉంటుంది. రెడ్ ఎఫ్ ఎం మరియు చుంబక్ వరుసగా రేడియో భాగస్వామి మరియు గిఫ్ట్ పార్ట్‌నర్‌గా ఉంటాయి. ఈ ఫెస్టివల్‌కు దేశ భాగస్వామి కూడా ఉంటారు - రాయల్ నార్వేజియన్ ఎంబసీ. ఇతర కీలక భాగస్వాములు పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా, మహీంద్రా వరల్డ్ సిటీ మరియు హైకమిషన్ ఆఫ్ కెనడా. అధికారిక హాస్పిటల్ పార్టనర్‌గా ఫోర్టిస్ హాస్పిటల్ సపోర్ట్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+