వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో అద్భుతమైన స్పీకర్లు.. మీరూ పాల్గొనాలంటే ఏం చేయాలి..?

Google Oneindia TeluguNews

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ (JLF) 15వ ఎడిషన్ 2022లో హైబ్రిడ్‌గా జరగబోతోంది. సాహిత్య మహోత్సవం మార్చి 5-14 వరకు ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడుతుంది మరియు మార్చి 10-14 వరకు మైదానంలో నిర్వహించబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన అనేక థీమ్‌లు మరియు ఈవెంట్‌లో 350 మంది రచయితలు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు విభిన్న సంస్కృతులకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. ఆ విధంగా సాహిత్యం, ఉపన్యాసం, సంగీత ప్రదర్శనలు, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లు, స్థానిక వంటకాలతో మంచి అనుభూతి ఇస్తుంది.
Oneindia మీడియా భాగస్వామిగా మరియు Daily Hunt ఆన్‌లైన్ స్ట్రీమింగ్ పార్టనర్‌గా ఉన్న ఈవెంట్‌లో, విభిన్న నేపథ్యం నుండి వచ్చిన ప్రజల ఆలోచనలు, చర్చలు మరియు సంభాషణలలో పాల్గొనేందుకు ఒక మంచి వేదికగా నిలుస్తోంది. ఇది ఆలోచనల మార్పిడికి వేదిక అవుతుంది మరియు ఎన్నికల ప్రక్రియ మరియు ప్రజాస్వామ్య వ్యవస్థల యొక్క కథనాలు మరియు ప్రతి-కథనాలను అన్వేషించేందుకు ఈ వేదిక చక్కటి అవకాశం కల్పిస్తోంది.

Impressive second tranche of speakers in spectacularly hybrid Jaipur Literature Festival

భారతదేశ మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఎవ్రీ ఓట్ కౌంట్స్ రచయిత నవిన్ బి చావ్లా; భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మరియు మేకర్స్ ఆఫ్ మోడ్రన్ దళిత్ హిస్టరీ రచయిత గురు ప్రకాష్ పాశ్వాన్, ప్రముఖ న్యాయనిపుణుడు మరియు భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ గౌరవనీయమైన ప్యానెల్‌లో భాగస్తులుగా ఉన్నారు.రాజకీయ మరియు ఎన్నికల ప్రక్రియపై ఇక్కడ చర్చిస్తారు. అంతేకాదు ప్రజాస్వామ్యం యొక్క వైరుధ్యాలు,విజయాలు, అపజయాలపై ప్రముఖ రచయిత ముకులిక బెనర్జీతో చర్చిస్తారు. సాహిత్యపరమైన చర్చలు, సంభాషణలు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఉంటాయి. భారతీయ వారసత్వాన్ని ప్రోత్సహించే ఎన్నో అంశాలపై ఇక్కడ చర్చించడం జరుగుతుంది. దీంతోపాటు సమాంతరంగా సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి కూడా జరుగుతుంది.

రచయితల జాబితా

15 మంది మాట్లాడే తొలి జాబితాలో ఉమెన్ హూ వేర్ ఒన్లీ దెమ్ సెల్వ్స్ రచయిత అరుంధతీ సుబ్రమణ్యం ఉన్నారు; ఢిల్లీకి చెందిన వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జన్, రచయిత మరియు సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని వాస్కులర్ క్యాథ్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ అంబరీష్ సాత్విక్; ప్రముఖ కళా విమర్శకులు, కళా చరిత్రకారుడు BN గోస్వామి; హడ్సన్ ఇన్స్టిట్యూట్ మరియు విల్ఫ్రైడ్ మార్టెన్స్ సెంటర్ ఫర్ యూరోపియన్ స్టడీస్‌లో సీనియర్ ఫెలో, మాజీ పోర్చుగీస్ రాజకీయవేత్త మరియు రచయిత బ్రూనో మాస్; బయో ఆర్కియాలజిస్ట్ మరియు ఫీల్డ్ ఆర్కియాలజిస్ట్‌లో ప్రత్యేకత చాటిన వైకింగ్ ఏజ్, వైకింగ్ మహిళలు మరియు రాపా నుయ్ డాక్టర్ క్యాట్ జర్మాన్‌లు ఉన్నారు.2021 బుకర్ ప్రైజ్ గ్రహీత ది ప్రామిస్ పుస్తక రచయిత డామన్ గల్గుట్ ఉన్నారు.తొలి నవల వెర్నాన్ గాడ్ లిటిల్ డీబీసీ పియర్ ‌తోనే 2003లో బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్ రచయిత ఉన్నారు; భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ రచయిత, నాటక రచయిత మరియు స్క్రీన్ రైటర్ ఫరూఖ్ ధోండీ కూడా పాల్గొంటున్నారు.

Impressive second tranche of speakers in spectacularly hybrid Jaipur Literature Festival

ఈ జాబితాలో ఇంకా నేషనల్ బుక్ అవార్డ్-విజేత రచయిత మరియు 2002 పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫైనలిస్ట్ జోనాథన్ ఫ్రాంజెన్‌ కూడా ఉన్నారు. అనేక విమర్శకుల ప్రశంసలు పొందిన నవలా రచయిత, ది మినియచరిస్ట్ మరియు కల్కట్టా మరియు ది జపనీస్ వైఫ్ రచయిత కునాల్ బసు ఉన్నారు. విద్యావేత్త మరియు రచయిత కల్టివేటింగ్ డెమోక్రసీ: పాలిటిక్స్ అండ్ సిటిజెన్‌షిప్ ఇన్ అగ్రేరియన్ ఇండియా రచయిత ముకులికా బెనర్జీ; పార్లమెంటు సభ్యులు మరియు రచయిత డాక్టర్ శశి థరూర్; తాజా సమీకరణాల తొలి నవలా రచయిత్రి శివాని సిబల్; చరిత్రకారుడు మరియు మూడు ప్రశంసలు పొందిన పుస్తకాల రచయిత, సిక్స్‌టీన్ స్ట్రామీ డేస్, ఇంపీరియల్ సావెరినిటీ అండ్ లోకల్ పాలిటిక్స్ రచయిత నెహ్రూ:డిబేట్స్ అండ్ డిఫైన్డ్ ఇండియా రచయిత త్రిపుర్దమన్ సింగ్; చరిత్రకారుడు మరియు నాలుగు ప్రశంసలు పొందిన పుస్తకాల రచయిత, సావర్కర్: ఎ కాంటెస్టెడ్ లెగసీ, 1924-1966 రచయిత విక్రమ్ సంపత్ ఉన్నారు.

ఇదిలా ఉంటే తొలిసారిగా గ్రౌండ్‌లో హాజరయ్యేవారు ఎంట్రీ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.మామూలుగా అయితే ఈ కార్యక్రమం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయడం జరిగింది.

రిజిస్ట్రేషన్ కోసం, మరింత సమాచారం కోసం జైపూర్ లిటెరేచర్ ఫెస్టివల్‌ను సందర్శించండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X