వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్: ప్రధాన ఆకర్షణగా నిలిచిన పాప్ సింగర్ ఉషా ఊతప్ మొజ్దా జమాల్‌జాదా

Google Oneindia TeluguNews

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 15వ ఎడిషన్‌లో ప్రముఖ పాప్ సింగర్ ఉషా ఊతప్ మరియు అఫ్ఘాన్-కెనడా సింగర్ మీడియా పర్సనాలిటీ మరియు ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త మొజ్దా జమాల్‌జాదాతో పాటు పలువురు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఊతప్ మరియు ఆమె కూతుెరు శృష్టి ఝాలు కలిసి మ్యూజిషియన్ మరియు రచయిత విద్యా షాతో కలిసి చర్చలో పాల్గొంటారు.ఉషా ఊతప్ బయోగ్రఫీ ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ పుస్తకంపై వీరిరువురూ చర్చిస్తారు.

Recommended Video

Jaipur Literature Festival 2022 | Oneindia Telugu

ఈ చర్చ సందర్భంగా ఉషా ఊతప్ తన కెరీర్ గురించి మాట్లాడతారు. తన సంగీత ప్రయాణంలో మధుర జ్ఞాపకాలను అదే సమయంలో ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడతారు. ఇక మహిళా హక్కుల నేత మొజ్దా జమాల్‌జాదా మహిళా హక్కులపై చర్చిస్తారు. తన బయోగ్రఫీ వాయిస్ ఆఫ్ రెబిలియన్ పుస్తకంపై మాట్లాడతారు. అఫ్ఘానిస్తాన్‌కు ఒక ఆశాదృక్పథ వాతావరణం ఎలా తీసుకురాగలిగారో ఈ సందర్భంగా వివరిస్తారు.

Usha Uthup, Mozhdah Jamalzadah to headline 15th Jaipur Literature Festival

సమాజ నిర్మాణంలో అఫ్గాన్ మహిళల పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. తాను రాసిన పుస్తకంతో పాటు తన అనుభవాలను ఈ సందర్భంగా మొజ్దా జమాల్‌జాదా వివరిస్తారు. ఇక మరో బ్రిటీష్ రచయిత మోనికా అలీ బీ రౌలత్‌తో ముచ్చటిస్తారు.

నాల్గవ రోజు రౌండప్

నాల్గవ రోజు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టోరీ టెల్లింగ్ అంటే కథలు చెప్పడం వంటివి ఆకట్టుకున్నాయి. పుస్తకాల నుంచి ఆలోచనలతో కథను ఎలా చెప్పొచ్చో ఇక్కడ హాజరైన వారికి అర్థమైంది. నాల్గవ రోజు సూఫీ సంగీతంతో ప్రారంభమైంది. శ్రీనగర్ కశ్మీర్‌కు చెందిన అలి సఫుద్దీన్ మరియు నూర్ మొహ్మద్‌ల సూఫీ సంగీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం తర్వాత ప్రముఖ చరిత్రకారుడు హిమాన్షు ప్రభ రేతో చర్చ సాగింది. ఈ కార్యక్రమంలో హిందూత్వం, బౌద్ధం, సంస్కృతం ఆగ్నేసియాపై ఎలాంటి ప్రభావం చూపిందన్న అంశంపై చర్చ జరిగింది.

Usha Uthup, Mozhdah Jamalzadah to headline 15th Jaipur Literature Festival

ఇక మరో సెషన్‌లో రిటైర్డ్ దౌత్యాధికారి వినోద్ ఖన్నాతో పాటు మరో పరిశోధకురాలు మాలినిశరన్ ఇండోనేషియాలో రామాయణం సంప్రదాయంపై చర్చించారు. ఇండోనేషియాలో రామాయణ ఇన్ ఇండోనేషియా అనే పుస్తకంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇండోనేషియాలో రామాయణ ఎలాంటి ప్రభావం చూపిందనే విషయంపై లిటరేచర్ ఫెస్టివల్ కో డైరెక్టర్ విలియం డాల్‌రింపుల్‌తో చర్చించారు. ఈ సందర్భంగా మాలిని శరణ్ రామయణ జావా బాలి ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం చూపిందో ఒక ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

ఇక మీరు కూడా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొనాలంటే ముందుగా Jaipur Literature festival వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X