రేప్: అవమానంతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరవ తరగతి చదువుతున్న బాధితురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పొరిగింట్లోని వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆందోళనకు, మనస్తాపానికి గురైన బాధిత బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
బాధితురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేసి, ఆస్పత్రికి తరలించారు. కత్వా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమె శరీరానికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనపై పొరిగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడటంతో అవమానంగా భావించి తాను ఆత్మహత్యకు యత్నించానని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు బుర్దవాన్ జిల్లా ఎస్పి ఎస్ఎం మిర్జా తెలిపారు.












Click it and Unblock the Notifications