అమ్మాయిల చిత్రాలు వీడియో తీసి బ్లాక్‌మెయిల్, అరెస్ట్

వివరాల ప్రకారం.. నిందితుడు స్వామి దాదాపు పది మంది యువతులు, స్కూల్ అమ్మాయిల ఫోన్ నెంబర్లను తాను పని చేసే పిజ్జా ఔట్ లెట్ నుండి తీసుకున్నాడు. వారిలో పలువురికి ఫోన్ చేసి వారితో పరిచయం పెంచుకున్నాడు. వారితో మరింత చనువు పెరిగిన తర్వాత శారీరక సంబంధం కోసం బలవంతం చేసేవాడు. ఆ తర్వాత వారి చిత్రాలను ఇతరులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
అతడు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుండటంతో బాధిత అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. బాధితులలో యువతులతో పాటు పాఠశాల అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓ వివాహిత కూడా స్వామి వలలో పడిందని తెలుస్తోంది. ఓ బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్వామిని అరెస్టు చేశారు.
ఫిర్యాదు చేసిన బాధితురాలుకు గత నెల రోజులుగా స్వామి నుండి బ్లాక్ మెయిల్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనను కలవాలని, లేదంటే నీ ఫోటోలో సర్క్యులేట్ చేస్తానని నిందితుడు బాధితురాలికి ఫోన్సు చేశాడు. దీంతో నంబరును ట్రేస్ చేసి స్వామిని పట్టుకున్నారు.
స్వామిని మూడేళ్ల క్రితం కూడా పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్లను సర్క్యులేట్ చేసిన కేసులో అతనిని అప్పుడు అరెస్టు చేశారు. అప్పుడు స్వామి మాండ్యా జైలులో ఆరు నెలలు ఉన్నాడు. జైలు నుండి విడుదలయిన తర్వాత బెంగళూరుకు వచ్చి పిజ్జా కార్నర్‌లో డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యాడు.












Click it and Unblock the Notifications