కాల్ సెంటర్ ఉద్యోగిని హత్య: రేప్ అనుమానాలు

హత్యకు గురైన 21 ఏళ్ల నోయిడాలోని చోత్పూర్ నివాసి. ఢిల్లీ శివారులోని సెక్టార్ 65లో గల బిపిఓలో ఆమె పనిచేస్తోంది. మరో నలుగురు మహిళా సహోద్యోగులతో కలిసి ఆమె రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరింది.
చోత్పూరు కాలనీ వెలుపల వారు ఆమెతో విడిపోయారు. ఆమె ఒంటరిగా ఇంటికి నడక సాగించింది. అయితే, ఇంటికి చేరుకోలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం విపరీతంగా గాలించారు. అయితే ఫలితం లేకపోయింది. ఆమె శవం శనివారం ఉదయం పుష్తా ప్రాంతంలో కనిపించింది. ఆమె దేహంపై గాయాలున్నాయి.
అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప అది నిర్ధారణ కాదని అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications