అత్యాచారం చేయిబోతే అరిచినందుకు నోట్లో కడ్డీ పెట్టాడు

కేబుల్ బిల్లు వసూలుకు వెళ్లి యువతిపై కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విచారణ పేరిట పోలీసు స్టేషన్‌లోనే దళిత యువతిపై కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ చిత్తురు జిల్లాలో అత్యాచారం చేశాడు. తమిళనాడు రాజధాని చెన్నై మైలాపూర్ ప్రాంతంలో ఏడాదిన్నర వయసు గల పాపపై కుమరన్ అనే కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను ఆడిస్తున్నట్లు నటించి చిన్నారితో సహా అక్కడ నుంచి మాయమయ్యాడు.
పాప కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లి వీధులన్నీ గాలించింది. పక్క వీధిలో చిన్నారి తీవ్ర గాయాలతో, రక్తస్రావంతో ఏడుస్తూ కనిపించింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు అర్థమైంది. కుమరన్ తల్లి కస్తూరి వచ్చి విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లొద్దంటూ పాప తల్లిదండ్రులను వేడుకుంది. కానీ, ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కుమరన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన కస్తూరి మంగళవారం ఉరి వేసుకుని మరణించింది.
ఢిల్లీలో మరో కీచకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి అనిల్ కుమా ర్ (26) అనే యువకుడు లజ్‌పత్‌నగర్‌లోని ఓ ఇంటికి కరెంటు బిల్లు వసూలు చేసేందుకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చేతికి అందిన ఇనుప కడ్డీని నోట్లో గుచ్చాడు. ఇరుగు పొరుగు అక్కడికి చేరుకోగానే పారిపోయాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదిలావుంటే, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ప్రేమ్ అనే భూస్వామి కుమారుడు 20 ఏళ్ల యువతిని పుట్టిన రోజు వేడుకలకు పిలిచాడు. ఆమెకు మత్తుమందు కలిపిన శీతల పానీయం ఇచ్చి, ప్రేమ్, అతని బంధువులు రాజేంద్ర, హరీశ్ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications