మిత్రుడి భార్యపై రేప్: ఢిల్లీలో మరో బాలికపై అత్యాచారం

హరిశంకర్‌ను పోలీసులు అరెస్టు చేసి, అత్యాచారం ఆరోపణ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తనను తొలుత మార్కెట్‌లో కలిశాడని, తర్వాత తనను ముందే నిర్ణయించుకున్న స్థలానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి దిగాడని బాధితురాలు ఈ నెల 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరదలు పెళ్లి కోసం ఆమె ఇక్కడికి వచ్చింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.
ఢిల్లీలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. తూర్పు ఢిల్లీలో 22 ఏళ్ల టైలర్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మయూర్ విహార్ సమీపంలోని చిల్లా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ నిందితుడు అంజాద్ ఖాన్‌కు సొంత దుకాణం ఉంది.
బాధితురాలి తల్లిదండ్రులు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. తనకు కొద్ది నెలలుగా ఖాన్ తెలుసునని, శనివారం తన దుకాణానికి రావాలని ఖాన్ అడిగాడని బాధితురాలు చెప్పింది. దుకాణంలోనే బాలికపై అతను అత్యాచారం చేశాడని, ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు చెప్పిందని, దాంతో వారు తమ వద్దకు వచ్చారని పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications