ఇంట్లోకి చొరబడి మహిళపై అత్యాచారం, ఆపై హత్య

మహిళ ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి చొరబడి దుండగులు అత్యాచారానికి, హత్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారంనాడు చెప్పారు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారు జామున జరిగింది.
మహిళ బంధువు ఒకతను పాత గోవా పోలీసు స్టేషన్‌లో సంఘటనపై పిర్యాదు చేశాడు. మహిళ పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.
దారుణానికి పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళపై తొలుత అత్యాచారం చేశారని, ఆ తర్వాత మెత్తటి వస్తువుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications